సుగాలీ ప్రీతి కుటుంబానికి జనసేన “న్యాయం”..!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాల ఘటనలు రోజూ వెలుగు చూస్తున్నాయి. మహిళా కమిషన్ చైర‌్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. ప్రతీ రోజూ..జిల్లాలకు వెళ్లి బాధితుల్ని పరామర్శించి నిందితుల్ని వదిలి పెట్టబోమనే హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా… సుగాలీ ప్రీతి ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ హామీ ఇచ్చినా సుగాలీ ప్రీతి కుటుంబానికి న్యాయం జరగలేదని..ఓ ఆడపిల్లకు న్యాయం చేయలేని ప్రభుత్వం ఉంటే ఒకటి..లేకపోతే ఒకటా అని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ నేతలు.. కార్యకర్తలు ఈ అంశాన్ని ప్రత్యేకంగా తీసుకుని క్యాంపైన్ నిర్వహిస్తున్నారు.

జనసేన సైనికులసోషల్ మీడియా ఉద్యమంతో ప్రభుత్వం కూడా స్పందించింది. దిశపై జరిపిన సమీక్షలో సీఎం జగన్ కూడా సుగాలీ ప్రీతి కుటుంబానికి న్యాయంపై చర్చించారు. సీబీఐ విచారణ కోసం మరోసారి కోర్టుకెళ్లాలని నిర్ణయించారు. వారి కుటుంబానికి సాయంపైనా అధికారులతో చర్చించారు. ఆ తర్వాత సుగాలి ప్రీతి తల్లిదండ్రులతో కర్నూలు కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప సమావేశం అయ్యారు. ప్రీతి తల్లిదండ్రులకు 5 ఎకరాల భూమి, 5 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. ప్రీతి తండ్రి రాజునాయక్‌కు ఉద్యోగం ఇస్తామని.. ప్రీతి తల్లి పార్వతి కాలికి ఆపరేషన్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

2017లో కర్నూలులోనే కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ లో అనుమానాస్పద స్థితిలో సుగాలీ ప్రీతి చనిపోయింది. స్కూల్ యాజమాన్యానికి చెందిన వారే ఆమెను దారుణంగా హత్య చేశారని.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అప్పటి నుండి ఉద్యమమం చేస్తున్నారు. జనసేన నేతలు..సుగాలి ప్రీతికి న్యాయం కోసం సోషల్ మీడియాలోపోరాటం చేస్తే.. పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు. చివరికి..ప్రభుత్వం సీబీఐకి ఇస్తున్నట్లుగా ‌ గతంలోజీవో జారీ చేసింది. కానీ.. సీబీఐ విచారణ ప్రారంభమయ్యేలా చేయడానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోలేదు. దీనిపై జనసేన సోషల్ మీడియానే మళ్లీ స్పందించి ఉద్యమం చేస్తే ప్రభుత్వం దిగి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close