యంగ్ టైగర్ యన్టీర్ ‘జనతా గ్యారెజ్’ పాటలు అదుర్స్..!

యంగ్ టైగర్ యన్టీర్ హీరోగా నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ సినిమా టీజర్ తో ట్రైలర్స్ తో రోజు రోజుకీ అంచనాలను పెంచుకుంటూ దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ లాంటి రెండు బ్లాక్‌బస్టర్స్ తెరకెక్కించిన కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న హాట్ట్రిక్ మూవీ కావడంతో ‘జనతా గ్యారెజ్’ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. మైత్రి మూవీస్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా కి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ పై కూడా అదే స్థాయిలో అంచనాలున్నాయి. మరి ఎన్టీఆర్, కొరటాల శివ, దేవిశ్రీ కాంబినేషన్ లో లహరి మ్యూజిక్ ద్వారా విడుదల అయినా ఆడియో ఎంత వరకు సక్సెస్ అయ్యింది, పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం…

1 వ పాట : ‘ ప్రణామం’
పాడింది : శంకర్ మహదేవన్
రచన : రామ జోగయ్య శాస్త్రి
Pranaamamప్రణామం.. ప్రణామం అనే ఈ పాట ట్యూన్ పరంగా దేవిశ్రీ ప్రసాద్ కొత్తదనం చూపించినట్లు కనిపించలేదు. ‘తోం దిరనా’ అంటూ మొదలయ్యే బిట్ మాత్రం బాగుంది. అయితే మధ్యలో గిటార్, కీ బోర్డ్ మిక్స్ చేస్తూ చేసిన ప్రయోగం బాగా ఆకట్టుకుంది. శంకర్ మహాదేవన్ ఎప్పట్లానే తన స్టైల్లో పాటకు ఓ స్థాయి తీసుకొచ్చాడు. ఇక రామ జోగయ్య శాస్త్రి ప్రకృతికి ప్రణామం అంటూ రాసిన సాహిత్యం చాలా బాగుంది. వినగానే ఎక్కేసే స్థాయిలో లేకపోయినా వినగా, వినగా ఈ పాట బాగానే ఎక్కేస్తుందని చెప్పొచ్చు.

2 వ పాట : ‘రాక్ ఆన్ బ్రో’
పాడింది : రఘు దీక్షిత్
రచన : రామ జోగయ్య శాస్త్రి
Rock On Bro‘రాక్ ఆన్ బ్రో’ అంటూ సాగే ఈ పాట కూడా దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ పెద్దగా చెప్పుకోవడానికి లేదు. ఇదే ట్యూన్‌తో దేవిశ్రీ ప్రసాద్ గతంలో ఎన్నో పాటలను సమకూర్చి ఉన్నాడన్న విషయం పాట వింటూంటే ఇట్టే అర్థమైపోతుంది. కాకా పోతే రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం అదిరింది. లిరికల్ బ్యూటీగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనసిపుడూ మబ్బులో విమానం, మన్నాటలో చండోడిలా, కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం.. లాంటి ప్రయోగాలు పాట లో నిండు తనం ఇచ్చాయి. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం, రఘు దీక్షిత్ గానం కలిసి ఆ పాత ట్యూన్ ఇది అని బయటపెట్టకుండా పాటకు మంచి ఫీల్ తెచ్చిపెట్టాయి.

3 వ పాట : ‘ఆపిల్ బ్యూటీ’
పాడినవారు : యాజిన్ నిజార్, నేహా బాసిన్
రచన : రామ జోగయ్య శాస్త్రి
Apple Beautyఆపిల్ బ్యూటీ అంటూ సాగే ఈ పాట ఆల్బమ్ మొత్తంలో చాలా సాదాసీదా పాటగా చెప్పుకోవచ్చు. అమ్మాయి అందాన్ని పొగుడుతూ వచ్చే సాహిత్యం గతం లో చాలా తెలుగు సినిమాల్లో ఎప్పుడూ వినిపించేదే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కూడా మాములుగా ఉంది. యాజిన్ నిజార్, నేహా బాసిన్‌ల గానం ఫర్వాలేదు.వినడానికి ఈ పాట అంత సొంపుగా లేకపోయినా, సినిమాలో విజువల్స్ పరంగా చూస్తే బాగుంటుందేమో చూడాలి.

4 వ పాట : ‘జయహో జనతా’
పాడినవారు : సుక్విందర్ సింగ్, విజయ్ ప్రకాష్
రచన : రామ జోగయ్య శాస్త్రి
Jayaho-Janatha‘జనతా గారేజ్’ ఆడియో మొత్తంలో హైలైట్ పాటంటే ‘జయహో జనతా’ అనే చెప్పుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఈ ట్యూన్ వినగానే ఎక్కేసేలా ఉంది. పాటలో అన్నివిధాలా మంచి ఫీల్ ఉంది. సుక్విందర్ సింగ్, విజయ్ ప్రకాష్‌ల గానం పాటకు స్థాయి పెంచింది. మధ్యలో ఇన్స్ట్రుమెంట్స్‌తో చేసిన ప్రయోగం కూడా చాలా బాగుంది. రామ జోగయ్య శాస్త్రి రచన పాటకు ఓ అర్థాన్ని తెచ్చిపెట్టింది. సంగీతం, సాహిత్యం, గానం.. మూడూ సరిగ్గా కుదిరిన ఈ పాట సినిమాలో విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు మరో రేంజ్‌లో ఉంటుందనే ఊహించొచ్చు.

5 వ పాట : ‘నీ సెలవడిగీ’
పాడింది : శ్వేతా మోహన్
రచన : రామ జోగయ్య శాస్త్రి
Nee-Selavadigiనీ సెలవడిగీ.. అంటూ సాగే ఈ పాట జయహో తర్వాత ఆ స్థాయి పాటగా చెప్పుకోవచ్చు. వినగానే ఎక్కేసే ఈ పాట వినగా వినగా, ఇంకా బాగా ఎక్కేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మెలోడియస్ ట్యూన్ చాలా బాగుంది. దానికితోడు శ్వేతా మోహన్ గానంలో ఫీల్ కూడా బాగా రివీల్ అయింది. రామ జోగయ్య శాస్త్రి అందించిన రచన ఈ పాటకు ఓ స్థాయి తీసుకొచ్చింది. ‘భారంగా ఉంది నిజం.. దూరంగా వెళుతోంది జీవితం..’ లాంటి పదాలు ఉన్న ఈ పాట సినిమాలో ఓ బలమైన సన్నివేశంలో వస్తుందని మనం ఊహించొచ్చు.

6 వ పాట : ‘పక్కా లోకల్’
పడినవారు : గీతా మాధురి, సాగర్
రచన : రామ జోగయ్య శాస్త్రి
Pakka-Localపక్కా లోకల్ అంటూ సాగే ఈ పాట పక్క మాస్ సాంగ్ ఈ పాట గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అన్ని ఐటెమ్ సాంగ్‌ల తరహాలోనే ట్యూన్, బీట్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. దేవిశ్రీ ఈ పాట విషయంలో సేఫ్ గేమ్ ఆడి ఐటెమ్ సాంగ్స్‌లో ఏమేం కోరుకుంటారో అవన్నీ ఉండేలా చూసుకున్నాడు. గీతా మాధురి, సాగర్‌ల గానం కూడా ఈ శైలికి తగ్గట్టే కొనసాగింది. ఇక రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పక్కా మాస్ అనేలా ఉంది. సినిమాలో విజువల్స్‌తో కలిపి ఎన్టీఆర్, కాజల్ స్టెప్స్ వేస్తుంటే ఈ పాట బాగా ఆకట్టుకుంటుందని ఆశించొచ్చు.

విశ్లేషణ :
శ్రీ మంతుడు వంటి బ్లాక్ బస్టర్ తరువాత కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్, మైత్రి మూవీస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది.ఎక్కువగా అన్ని పాటల్లో లిరిక్స్‌దే డామినేషన్ కనిపించిందని ఒప్పుకొని తీరాలి. ‘జయహో జనతా’, ‘నీ సెలవడిగీ’, ‘ప్రణామం’.. ఈ మూడు పాటలనూ వినగానే ఎక్కేసేలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ‘రాక్ ఆన్ బ్రో’ పూర్తిగా సాహిత్య పరంగానే చూడదగ్గ పాట. మిగతా రెండు పాటలూ ఆడియోగా పెద్దగా ఆకట్టుకునే స్థాయిలో లేవని చెప్పుకోవాలి. ఈ చిత్రం ఆడియో ని కూడా మంచి ఫాన్సీ ఆఫర్ ఇచ్చి కొన్న లహరి మ్యూజిక్ వారు కొన్నట్టు బోగట్టా. టైటిల్ నుండి పోస్టర్స్ దగ్గర్నుంచి మొదలుకొని ప్రతీ అంశమూ ఎలా ఉందన్నది చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆడియోను సినిమాకు మొదటి విజయంగా భావించే తెలుగు పరిశ్రమలో ఆడియో బాగుంది అన్న టాక్ రావడమన్నది బాగా అవసరం. భారీ అంచనాల నడుమ విడుదలైన దేవిశ్రీ ప్రసాద్ అందించిన ‘జనతా గ్యారెజ్’ ఆడియో, అంచనాలకు దగ్గరగా వచ్చి బాగానే మెప్పించిందని చెప్పాలి.

తెలుగు360.కామ్ ఆడియో రేటింగ్ 3.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close