జనతా గ్యారేజ్…అన్నీ సూపర్ హిట్టే…ఆ ఒక్కటే బేలన్స్

టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన ఎన్టీఆర్, మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ.. ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో సినిమా కూడా సాధించలేకపోయిన ఓ రేర్ ఫీట్‌ని సాధించింది. ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్‌లో కొత్త సినిమా స్టార్ట్ అవబోతోంది అన్న న్యూస్ బయటికి వచ్చినప్పటి నుంచీ కూడా అన్నీ పాజిటివ్ వైబ్రేషన్సే కనిపించాయి. జనతా గ్యారేజ్ టైటిల్‌కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు. ‘ఇచ్చట అన్నీ రిపేర్లు చేయబడును’ అన్న క్యాప్షన్ కూడా అందరికీ నచ్చింది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌కి కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక టీజర్ అయితే సునామీనే సృష్టించింది. తెలుగు సినిమా లవర్స్ అందరికీ ఇనానిమస్‌గా నచ్చేసింది. యూట్యూబ్‌లో టీజర్ సృష్టించిన రికార్డ్స్ అన్‌బిలీవబుల్ అనే స్థాయిలో ఉన్నాయి. మలయాళం ప్రేక్షకులు కూడా డబ్బింగ్ వెర్షన్ టీజర్‌కి ఇంప్రెస్ అయ్యారు.

జనతా గ్యారేజ్‌కి సంబంధించి ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమా లీక్డ్ వీడియోస్ కూడా ఫ్యాన్స్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్ అయితే చాలా చాలా బాగుంది. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రణామం సాంగ్‌తో పాటు జనతా గ్యారేజ్ టైటిల్ సాంగ్ కూడా ఇన్‌స్టెంట్‌గా సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకుంది. మిగతా సాంగ్స్ విషయంలో కూడా కంప్లైంట్స్ ఏమీ లేవు. ఓవరాల్‌గా కూడా గుడ్ ఆల్బం అన్న ప్రశంశలు వచ్చాయి. వీటన్నింటితో పాటు థియేట్రికల్ ట్రైలర్‌కి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. ముఖ్యంగా ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూని డిస్కస్ చేస్తున్నారని తెలియగానే విమర్శకులు కూడా ప్రశంసించేశారు. సినిమా లవర్స్ కూడా కొత్తగా ఫీలయ్యారు. ఆడియో ఫంక్షన్ తర్వాత ప్రతి రోజూ రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సమంతా గ్లామర్, కాజల్ స్పెషల్ షో ఫొటో కూడా ఫ్యాన్స్‌ని మెప్పించాయి.

సో…….జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించినంత వరకూ ఇప్పటి వరకూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవుట్ పుట్ మొత్తం హిట్టేనన్నమాట. అందుకే బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాను భారీ రేట్లకు కొనేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా భారీగా హోప్స్ పెట్టుకుని ఉన్నారు. సినిమా లవర్స్ కూడా గ్యారేజ్‌ని ఎప్పుడెప్పుడు చూసేద్దామా? అన్న క్యూరియాసిటితో ఉన్నారు. స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకూ ఎన్టీఆర్, కొరటాల శివలు అన్ని టెస్ట్‌లనూ విజయవంతంగా పాస్ అయ్యారు. ఇక ఫైనల్ టెస్ట్ ఒక్కటే బేలన్స్. మూవీ రిజల్ట్ ఎలా ఉండబోతోందో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close