ఫ్లాష్ బ్యాక్‌: అనుమానంలో ప‌డిన విమానం

కొంద‌రికి కొన్ని భ‌యాలుంటాయి. ఒక‌రికి నీళ్లంటే భ‌యం. ఇంకొక‌రికి గాలంటే భ‌యం. కొంత‌మందికి ప్ర‌యాణాలంటే భ‌యం. సినిమా వాళ్ల‌లో చాలామందికి విమాన ప్ర‌యాణాలంటే చ‌చ్చేంత భ‌యం. కానీ.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో, అతి తొంద‌ర‌గా వెళ్లాల్సివ‌స్తే అంత‌కు మించిన మార్గం ఉండ‌దు. పైగా స‌మ‌యం క‌లిసి వ‌స్తుంది. సినిమా వాళ్ల‌కు స‌మ‌యం అంటే – బంగారంతో స‌మానం. అందుకే విమాన ప్ర‌యాణాలు చేయాల్సివ‌స్తుంటుంది. ఈ ప్ర‌యాణాల మీద ఎన్నో ఛ‌లోక్తులు. అందులో ఇదొక‌టి.

జంథ్యాల‌, వేటూరి.. ఇద్ద‌రికీ విమాన ప్ర‌యాణాలంటే కాస్త భ‌యం, ఇంకాస్త బెంగ‌. ఇద్ద‌రూ ఓసారి మ‌ద్రాసు నుంచి తిరువ‌నంత‌పురం వెళ్లాల్సివ‌చ్చింది. ఇద్ద‌రూ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అంత‌లో ఓ ప్ర‌క‌ట‌న వినిపించింది. ‘సాంకేతిక కార‌ణాల వ‌ల్ల విమానం ఓ గంట ఆల‌స్యంగా వ‌స్తుంది” అని. దానికి తోడు.. వాతావ‌ర‌ణం ఏమాత్రం బాలేదు. అటు వాతావ‌ర‌ణం, ఇటు సాంకేతిక లోపం.. రెండూ ఇద్ద‌రినీ తెగ భ‌య‌పెట్టేస్తున్నాయి. అయినా స‌రే.. పైకి గంభీరంగా న‌టించ‌డం మొద‌లెట్టారు.

ఇంత‌లో ఇద్ద‌రికీ ఓ బోర్డు క‌నిపించింది. విమాన ప్ర‌యాణాల ఇన్సురెన్సుకి సంబంధించిన బోర్డు అది.
ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు… ఇన్సురెన్సు చేయించుకోవాల‌ని ఫిక్స‌య్యారు. అయితే జంథ్యాల మాత్రం ”ఇదేదో మ‌న‌కు అవ‌స‌రం ప‌డేట్టే ఉందే..” అని మ‌న‌సులోని మాట పైకి అనేశారు.
”చేయిస్తే పోలా…” అంటూ వేటూరి సిద్ధ‌మ‌య్యారు.
”పోతామంటారా..” అని జంథ్యాల సందేహ ప‌డ్డారు.
”విమానం అనుమానంలో ప‌డింది క‌దా.. ” అన్నారు వేటూరి గుంభ‌నంగా.
”అది అనుమానంలో ప‌డినా, బంగాళా ఖాతం లో ప‌డినా మ‌నం మాత్రం సేఫ్‌గానే ఉంటాం లెండి” అన్నారు జంథ్యాల.
”అంత న‌మ్మ‌కం ఏమిటి” అని వేటూరి అడిగితే.. ”అది మ‌న‌మీదో, విమానం మీదో, పైలెట్ మీదో న‌మ్మ‌కంతో కాదు.. మ‌న ఇంట్లో వాళ్ల గీత‌ల‌పై ఉన్న న‌మ్మ‌కం” అంటూ ఇన్సురెన్సు చేయించ‌కుండానే ఇద్దరూ విమానం ఎక్కేశారు.
అప్ప‌టి నుంచి అటు జంథ్యాల‌, ఇటు వేటూరి ఇద్ద‌రూ విమాన ప్ర‌యాణం చేసిన‌ప్పుడ‌ల్లా…ఇదే విష‌యాన్ని గుర్తు చేసుకుని మ‌రీ న‌వ్వుకునేవార్ట‌. వేటూరి త‌న ‘కొమ్మ‌కొమ్మ‌కో స‌న్నాయి’ పుస్త‌కంలో ఈ త‌మాషా విష‌యాన్ని రాసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close