జాట్ల డిమాండ్ కి తలొగ్గిన ప్రభుత్వం

రిజర్వేషన్లు కోరుతూ హర్యానాలో జాట్ కులస్తులు చేస్తున్న ఉద్యమం నేడో రేపో ముగిసే అవకాశం కనపడుతోంది. ఈరోజు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చర్చించిన జాట్ నేతలకు ఆయన త్వరలో జరుగబోయే హర్యానా శాసనసభా సమావేశాలలో జాట్ కులస్తులకు ఓ.బి.సి.లో చేర్చేందుకు వీలుగా బిల్లును ప్రవేశపెడతామని హామీ ఇవ్వడంతో వారు సంతృప్తి చెందినట్లు కనబడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు సాధ్యాసాధ్యాలను అద్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.

ఆ హామీలతో సంతృప్తి చెందిన జాట్ సంఘర్ష్ సమితి నేత జైపాల్ సింగ్ సంగ్వాన్ మీడియా ద్వారా ఈ ఉద్యమంలో పాల్గొంటున్న జాట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ “హోం మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయి. మాకు ఇచ్చిన హామీలను త్వరలోనే అమలు చేస్తారని ఆశిస్తున్నాము. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఈ హామీలు అంగీకారమేనని నేను భావిస్తున్నాను. కనుక తక్షణమే ఉద్యమాన్ని నిలిపి వేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

ప్రస్తుతానికి ఈ కధ సుఖాంతం అయినట్లే కనిపిస్తోంది కానీ జాట్ ల ఉద్యమానికి ప్రభుత్వం దిగిరావడం వేరే ఇతర కులస్తులకు ప్రేరణ కలిగించి వారు కూడా రిజర్వేషన్లు  కోరుతూ ఇలాగే ఉద్యమాలు మొదలుపెడితే కేంద్రరాష్ట్రప్రభుత్వాలకి తట్టుకోవడం చాలా కష్టం కావచ్చు.ఇప్పటికే గుజరాత్ లో హార్దిక్ పటేల్, ఆంధ్రాలో ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్లు కోరుతూ పోరాటాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి డిమాండ్లు వినిపిస్తూనే చాలా ఉన్నాయి. వాటన్నిటికీ ఈ ఉద్యమం ప్రేరణ కలిగిస్తే ప్రభుత్వాలకి తట్టుకోవడం చాలా కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close