తెదేపాలో చేరబోతున్న జయసుధ?

ప్రముఖ నటి జయసుధ తెదేపాలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. ఈరోజు సాయంత్రం ఆమె ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరవచ్చునని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున సికిందరాబాద్ నుండి పోటీ చేసి గెలిచారు. కానీ ఆమె పార్టీలో ఇమడలేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకానొక సమయంలో రాజకీయాల నుండి తప్పుకోవాలని ఆలోచించారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు నచ్చచెప్పడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2014 ఎన్నికలలో మళ్ళీ సికింద్రాబాద్ నుండే పోటీ చేసినప్పటికీ, తెరాస ప్రభంజనంలో ఆమె ఓడిపోయారు. ఆ తరువాత ఆమె తెరాసలో చేరబోతున్నారనే వార్తలు వచ్చేయి. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అయితే అప్పటి నుండి పార్టీకి, రాజకీయ కార్యక్రమాలకి కూడా దూరంగా ఉంటున్నారు. ఆమె తెదేపాలో చేరినట్లయితే ఆమె వలన తెదేపా, బీజేపీ రెండు పార్టీలకి ఎంతో కొంత ప్రయోజనం కలగవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close