“జేసీ” తెలంగాణకు వెళ్లిపోతారట !

అసెంబ్లీ సమావేశాలు ఏ రాష్ట్రంలో ప్రారంభమైనా తొలి రోజు అక్కడ తన హాజరు చూపించి ఏవో కొన్ని వ్యాఖ్యలు చేయకపోతే జేసీ దివాకర్ రెడ్డికి మనసు ఊరుకోదు. తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకావడంతో తొలి రోజే ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో కనిపించారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌తోనూ సమావేశమయ్యారు. ఎం మాట్లాడారో కానీ తాము తెలంగాణను విడిచిపెట్టి తప్పు చేశామని బాధపడ్డారు. ఉద్యమం సమయంలోనే రాయల తెలంగాణ కావాలనికోరుకున్నామని కానీ జైపాల్ రెడ్డి పడనీయలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు ఏమీ బాగోలేవని.. తెలంగాణలో మాత్రం బాగున్నాయని చెప్పుకొచ్చారు.

గతంలో అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయానికి వచ్చి నాగార్జునసాగర్‌లో జానారెడ్డి ఓడిపోతారని ప్రకటించారు. ఈ విషయంపై మీడియాలో విస్తృత చర్చ జరగింది. హైకమాండ్‌కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో కాంగ్రెస్ నేతలు జేసీతో మాట్లాడేందుకు ఎక్కువ ఆసక్తి చూపించలేదు. సీఎల్పీకి వచ్చి కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మాట్లాడకూడదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించడంతో ఆయనకు సారీ చెప్పారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసని ..కానీ హుజురాబాద్‌లో ప్రస్తుత పరిస్థితి ఏంటో తనకు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.

జేసీ దివాకర్ రెడ్డి తాము తెలంగాణకు వస్తామని చెప్పడం అంటే రాజకీయంగా ఇక్కడకు వస్తామని చెప్పడమే కానీ అలాంటి పరిస్థితే లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. జేసీ నాన్ సీరియస్ కామెంట్స్ చేశారని అంటున్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్‌తో సమావేశం కావడంతో రాజకీయ గుట్టు ఏదో ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close