జేసీని కంట్రోల్ చేయాల్సిన అవ‌స‌రముంది..!

తెలుగుదేశం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మాట్లాడారు అంటే ఏదో ఒక సంచ‌న ప్ర‌క‌ట‌న ఉంటుంద‌నే ఇమేజ్ ఉంది! అయితే, ఆ ప్ర‌క‌ట‌నలతో సొంత పార్టీని ఇబ్బంది పెట్టే సంద‌ర్భాలే ఎక్కువ‌. తాజాగా అదే ప‌ని చేశారు. క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం కోసం టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ దీక్ష‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ శ్రేణుల‌న్నీ మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. దీన్ని విజ‌య‌వంతం చేయాల‌ని, రమేష్ కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని సీఎం కోరారు కూడా! అయితే, దీనిపై జేసీ ఏమంటారంటే… ఇలాంటి దీక్ష‌లు వ‌ల్ల ఉక్కు రాదు, తుక్కు రాదు అంటూ త‌న స‌హ‌జ ధోర‌ణిలో వ్యాఖ్యానించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్రధాని న‌రేంద్ర మోడీ ఏమీ చెయ్య‌ర‌నే విష‌యాన్ని తాను మూడేళ్లుగా చెబుతూనే వ‌స్తున్నాన‌ని జేసీ అన్నారు. భాజ‌పాని న‌మ్ముకోవ‌ద్ద‌ని చంద్ర‌బాబుకు కూడా చెబుతూనే వ‌చ్చాన‌నీ, కానీ ఆయ‌న విన్లేద‌ని మ‌రోసారి గుర్తు చేశారు. ఇప్పుడు సీఎంకి ప‌రిస్థితి అర్థ‌మై ఉంటుంద‌న్నారు. పాల‌కుల‌కు ప‌గ‌లూ ప్ర‌తీకారాలూ ఉండ‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికారు. జ‌గ‌న్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయ‌న‌కి అహంకారం ఎక్కువైపోయింద‌న్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్సార్ కీ జ‌గ‌న్ కీ చాలా తేడా ఉంద‌న్నారు. వైయ‌స్ ల‌క్ష‌ణాల్లో స‌గ‌మున్నా తామంతా ఆయ‌న వెంటే ఉండేవాళ్ల‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఓప‌క్క కడ‌ప ఉక్కు కార్మాగారం సాధ‌న కోసం టీడీపీ పోరాటం చేస్తుంటే, మరోప‌క్క అదే ఉద్య‌మంలో భాగంగా దీక్ష చేస్తున్న సీఎం ర‌మేష్ పై జేసీ ఇలాంటి విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రైంది కాద‌నే అభిప్రాయం టీడీపీ వ‌ర్గాల నుంచే వ్య‌క్త‌మౌతోంది. కేంద్రం ఏమీ చెయ్య‌ద‌నే విష‌యాన్ని మూడేళ్ల కింద‌టే ముఖ్య‌మంత్రితో చెప్పాన‌ని ప‌దేప‌దే చెప్ప‌డం వ‌ల్ల కొత్త‌గా ఉప‌యోగం ఏముంటుంది..? ఏమీ చెయ్య‌ద‌ని తేలిపోయింది కాబ‌ట్టే క‌దా, ఇప్పుడు టీడీపీ పోరాటం చేస్తోంది. కేంద్రంపై ఏదో ఒక మార్గంలో ఒత్తిడి అనేది లేకపోతే.. ఏమౌతుందీ? రావాల్సినవి కూడా రావు. ఇప్పుడు దాని కోసం జేసీ ఏం చెయ్యాలో అదే చెయ్యాలి. గతంలో చెప్పిన జోస్యం వదిలెయ్యండీ.. భవిష్యత్తు గురించి ఇప్పుడేం చేస్తున్నారో చెబితే పార్టీకి ఉపయోగకరం. అంతేగానీ, పార్టీ చేస్తున్న ఉద్య‌మాల‌ను త‌ప్పుబ‌డుతూ కూర్చుంటే ప్ర‌యోజ‌నం ఏముంటుంది..? ఈ వైఖ‌రి వ‌ల్ల ఇతర పార్టీల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొనాల్సిన ప‌రిస్థితిని పెంచి పోషించిన‌ట్టు అవుతుంది క‌దా! కాబ‌ట్టి, ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ్యొద్దంటూ ఆయ‌న్ని పార్టీ అధినాయ‌క‌త్వం మ‌రోసారి హెచ్చ‌రించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close