జేడీతో వ‌ర్మ సినిమా

న‌టుడిగా జేడీ చ‌క్ర‌వ‌ర్తి త‌నకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడంటే కార‌ణం… రాంగోపాల్ వ‌ర్మ‌. `శివ‌`తో జేడీతో పాటు చాలామందికి లైఫ్ ఇచ్చాడు వ‌ర్మ‌. కాక‌పోతే… జేడీని మాత్రం వ‌ర్మ వ‌ద‌ల్లేదు. ఆఖ‌రికి బాలీవుడ్‌కీ తీసుకెళ్లాడు. `స‌త్య‌`లాంటి సూప‌ర్ హిట్ ఇచ్చాడు. ద‌ర్శ‌కుడిగా మార్చాడు. కొన్నాళ్లుగా వ‌ర్మ – జేడీ దూరం దూరంగానే ఉంటున్నారు. అయితే… ఇప్పుడు మ‌ళ్లీ ఈ గురు శిష్యులు ఓ సినిమా చేయ‌బోతున్నారు. జేడీ క‌థానాయ‌కుడిగా న‌టించే ఈ చిత్రానికి వ‌ర్మ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడు. ద‌ర్శ‌కుడి పేరు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు. మ‌రోవైపు `థైస్ అండ్ గ‌న్స్‌` అనే వెబ్ సిరీస్‌ని అప్పుడెప్పుడో వ‌ర్మ ప్ర‌క‌టించిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ప్ర‌స్తుతం.. దాని ప‌నులు జ‌రుగుతున్నాయి. వీట‌న్నింటినీ.. జేడీనే ప‌ర్య‌వేక్షిస్తున్నాడు. వ‌ర్మ ఆధ్వ‌ర్యంలోనే మ‌రో బెస్ సిరీస్ కూడా జేడీ ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి గురు శిష్యులు మ‌ళ్లీ యాక్టీవ్ అవుతున్నార‌న్న‌మాట‌. జేడీ ఓ ప్ర‌ధాన పాత్ర పోషించిన `హిప్పీ` ఈవారం విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. కార్తికేయ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రానికి కృష్ణ ద‌ర్శ‌కుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close