సీఎం రమేష్‌కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ సంఘిభావం..‍‍ !‍

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ…కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణదీక్ష చేస్తున్న సీఎం రమేష్‌ను కలిశారు. సంఘిభావం తెలిపారు. ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉన్నా.. ఉక్కుదీక్షను కొనసాగించడం అభినందనీయమని లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు. సీబీఐ మాజీ జేడీ ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్నారు. వివిధ వర్గాల సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. రెండు నెలల్లో సమస్యలపై అధ్యయనం పూర్తి చేసి..తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇస్తానని గతంలోనే ప్రకటించారు. అయితే లక్ష్మినారాయణపై తరచూ ఫలానా పార్టీలో చేరబోతున్నారంటూ రూమర్లు వస్తూంటాయి. దానికి కారణం..ఆయన అన్ని పార్టీల నేతలను ఏదో ఓ సందర్భంలో కలవడమే.

కొద్ది రోజుల కిందట లక్ష్మినారయణ.. పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించారు. ఆ సమయంలో రాజమండ్రిలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో సమావేశమయ్యారు. స్నేహపూర్వక భేటీనేనని చెప్పారు. అంతకు ముందు తిరుపతిలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను మీడియా అడిగిన ప్రశ్నకు కన్ఫ్యూజ్ కు గురయి… చెప్పిన సమాధానంతో… సీబీఐ మాజీ జేడీ కూడా బీజేపీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై చంద్రబాబు కూడా స్పందించడం వివాదాస్పదమయింది. ఇక ఏ జిల్లాకు వెళ్లినా.. లక్ష్మినారాయణ ఓ పద్దతి ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఎక్కడా తనపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలను సమర్థించడం, విమర్శించడం చేయడం లేదు. ప్రభుత్వానికి ఎప్పుడైనా అనుకూలంగా మాట్లాడినట్లయితే..టీడీపీలో చేరబోతున్నారని.. కాస్త వ్యతిరేకంగా మాట్లాడితే..బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే .. తన రాజకీయ ప్రవేశంపై .. సీబీఐ జేడీ .. ఎవరి ఊహాగానాలపైనైనా స్పందించడానికి నిరాకరిస్తున్నారు.

ఏ విధంగా చూసినా లక్ష్మినారాయణ… పూర్తిగా పొలిటికల్ మైండ్ తో మాత్రం వెళ్లడం లేదు. సమస్యల పరిశీలనకు బాధితుల వద్దకు వెళ్లినప్పుడు కూడా ఆయన స్పందనలు అలాగే ఉంటున్నాయి. పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించినప్పుడు… తమకు సరైన పరిహారం అందలేని ఓ గ్రామవాసులు సీబీఐ జేడీ దృష్టికి తీసుకెళ్లారు. సహజంగా..జగన్, పవన్ లాంటి రాజకీయ నేతలైతే… ప్రభుత్వంపై నిందలేసి..మనమొచ్చాకా న్యాయం చేసుకుందామంటారు. కానీ.. సీబీఐ జేడీ మాత్రం నిబంధనలు పరిశీలించిన తర్వాత.. మాట్లాడుకుందామని నేరుగా నే చెప్పేశారు. సీబీఐ మాజీ జేడీ ఇప్పుడు … సీఎం రమేష్ ను పరామర్శించి సంఘిభావం తెలిపారు.. కనుక.. ఆయన టీడీపీలోకి వెళ్తారన్న అంచనాలు పెరిగిపోవచ్చు. సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరగొచ్చు. కానీ అసలు లక్ష్మినారాయణ ఆలోచనలేమిటన్నది.. ఆయనకు మాత్రమే తెలుసు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close