‘జేడీ’ లక్ష్మీనారాయణ – విజయసాయిరెడ్డి ల మధ్య ట్విట్ల యుద్ధం

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ని వై ఎస్ ఆర్ సి పి లో లో రెండవ స్థానంలో ఉన్న నేత విజయసాయిరెడ్డి ఎందుకనో కానీ పదే పదే తన వ్యాఖ్యలతో కెలుకుతున్నాడు. మొన్నటికి మొన్న లక్ష్మీనారాయణ కి తమ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసిందో కూడా తెలీదు అంటూ ఎద్దేవా చేయడానికి ప్రయత్నించి, విజయసాయిరెడ్డి తానే అభాసు పాలైన విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని అంతటితో వదిలేయకుండా విజయ సాయిరెడ్డి, ఉద్దేశపూర్వకంగా లక్ష్మీనారాయణను టార్గెట్ చేస్తూ మళ్లీ పలు ట్వీట్లు చేశాడు.

విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ, “జేడీ గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్ర బాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్ బీ ఫారాలు ‘పోగొట్టుకున్నట్టు’ గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి ‘త్యాగం’ చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి.పాపం! బాలక్రిష్ణ చిన్నల్లుడు భరత్‌కు టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి మద్ధతు మాత్రం మీకివ్వమని తండ్రీ కొడుకులిద్దరూ కేడర్‌కు చెప్పిన విషయం నిజం కాదా జేడీ గారూ? ఓట్లు చీల్చి జనాలను వెర్రి పుష్పాలు చేసేందుకు వేర్వేరుగా పోటీ చేశారు. మీ చీకటి పొత్తులను ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారు. His Master’s Voice (HMV) అన్న బిరుదు మీకు చక్కగా సరిపోతుంది జేడీ గారూ. తెలుగుదేశంలో చేరాలనుకుని ముహూర్తం కూడా పెట్టుకున్నాక, మీ బాస్ చెప్పినట్టు ఆఖరిక్షణంలో జనసేనలో చేరారు. మీ కమిట్‌మెంట్‌ను అభినందించాల్సిందే. ఒకటి నుంచి ఐదు అంకెల్లో ఏది లక్కీ నంబరో వెతుక్కుని లెక్కలు వేసుకోండి.జేడీ గారూ, మీ నాయకుడు కుప్పం, మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో ఒక మాట అడిగి క్లారిటీ ఇవ్వండి. 88 సీట్లు గెలుస్తారో లేదో దీన్ని బట్టే తెలిసి పోతుంది. ‘ప్రశ్న ప్యాకేజీ కోసం రాజీపడి పాదాక్రాంతమైతే’ ప్రజలు నిర్దయగా గుణపాఠం చెబుతారని చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది.లక్ష్మీనారాయణ గారూ… మీరు ఈ రోజుకూ జేడీనే. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశానికి-జనసేనకు జాయింట్ డైరెక్టర్! నేరగాళ్ళ పార్టీకి, విలువల్లేని పార్టీకి తమరే సంయుక్త సంచాలకులు!జేడీ గారూ… మీరు 2 నెలల క్రితం లోక్ సత్తా కండువా కప్పుకోబోయి… నెల క్రితం భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యి…ఆ తర్వాత 2 రోజుల్లోనే జనసేన తరఫున విశాఖ ఎంపీగా బరిలోకి దిగారు. 3 నెలల్లో 3 పార్టీలు! అహా… ఏమి ప్రజాస్వామిక విలువలు? ఏమి రాజకీయ విలువలు?జేడీ గారూ… మీ టిక్కెట్ల లోగుట్టు అందరికీ తెలిసినదే. తీర్థం (బీఫామ్ మీద సంతకం) జనసేనది…. ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చినది 175లో 65 బీఫామ్లు. కాదు… మొత్తం తెలుగుదేశం చెపితేనే ఇచ్చాం అని మీరు ఒప్పుకోదలుచుకుంటే మీ ఇష్టం!” అని రాసుకొచ్చాడు.

అయితే, విజయ్ సాయి రెడ్డి ట్వీట్లు జనసేన అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. విజయసాయిరెడ్డి ట్వీట్ల పై అధికారికంగా జేడీ లక్ష్మీనారాయణ కూడా స్పందించాడు. అయితే విజయసాయిరెడ్డి దిగజారుడు ట్వీట్లతో పోలిస్తే, లక్ష్మీనారాయణ చాలా హుందాగా స్పందించాడనే చెప్పాలి. పైగా పొద్దస్తమానం ఇలా అనవసరమైన ట్వీట్లతో కాలం సరిపుచ్చకుండా దేశానికి పనికొచ్చే విషయాల మీద ఫోకస్ ఇస్తే బాగుంటుంది అంటూ అన్యాపదేశంగా చురకలు కూడా అంటించారు.

లక్ష్మీనారాయణ ట్వీట్ చేస్తూ, “గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, జనసేన పార్టీ పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద. మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14. అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది.

మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు. మీ లెక్కలు సరి చూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి.మీ హైదరాబాద్, ఢిల్లీ ట్యూషన్లు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ట్యూషన్ మాస్టర్లు కోప్పడతారు. ఒకసారి లెక్కలు సరి చూసుకోండి. ఎగువ సభ ఔన్నత్యాన్ని నిలబెట్టండి. ప్రజలందరూ చూస్తున్నారు. మాది పారదర్శకమైన పార్టీ. మా జనసేన పార్టీ హోదాలతో పనిచేసే పార్టీ కాదు, హృదయాలతో పనిచేసే పార్టీ. గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, 65 + 80 = 145 అవుతుంది. జనసేన పార్టీ స్వయం బలం మీద 140 స్థానాల్లో పోటీ చేసింది. మిత్రపక్షాలు మిగతా 35 స్థానాలు. మాకు ఎవ్వరి బీ-ఫామ్స్ అవసరంలేదు. నేను రాజకీయాల్లో చేరతానని చెప్పగానే, అన్ని పార్టీలు వారి ప్రతినిధులను పంపి మా పార్టీలో చేరండి అని ఆహ్వానం పంపిన విషయం అనేక టీవీ ఛానెళ్ళకు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో నేనే స్వయంగా చెప్పాను. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, మీరే మీ పార్టీలో నాకు ఎర్ర తివాచీ వేసి ఆహ్వానిస్తానన్న విషయం మీరు ఎక్కడా బహిర్గతం చేయట్లేదు. దీనిబట్టి మీరు ఎన్ని విషయాలు ప్రజల దగ్గర దాస్తున్నారో తెలుస్తుంది.మీ ఆహ్వానాన్ని గౌరవంగా తిరస్కరించినందుకు మీ బాధను మరో రూపంలో వ్యక్తం చేస్తున్నారా? మీ అసత్య ట్వీట్లకు సమాధానమిస్తూ నా అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోలేను. ఇది మీరు గమనించగలరు. ఇకపై మీ ట్వీట్లకు మా జనసైనికులు అవసరం అనుకుంటే సమాధానమిస్తారు! ధన్యవాదాలు. విజయసాయిరెడ్డి గారు, నేను ప్రస్తుతం రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం (Poverty) మరియు నిరుద్యోగం (Unemployment) నిర్మూలనకై పాలసీ తయారీలో నిమగ్నమైవున్నాను. దీనికి మీదగ్గర ఏమైనా ప్రత్యామ్నాయాలు వుంటే నాకు తెలియచేయగలరు.”

సోషల్ మీడియాలో లక్ష్మీనారాయణ వ్యాఖ్యలకు విపరీతమైన స్పందన వస్తుంది. తన వైపు నుండి ఎటువంటి రెచ్చగొట్టే చర్యలు లేకపోయినప్పటికీ, విజయసాయిరెడ్డి పదేపదే లక్ష్మీనారాయణ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినందువల్ల, ఆ వ్యాఖ్యలలో కూడా అ డేటా పరమైన తప్పిదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉండటం వలన, అలా కనిపిస్తున్నప్పటికీ దానిని సమర్థించుకోడానికి సంబంధం లేని తలాతోకాలేని వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి పదేపదే చేస్తూ ఉండడం వల్ల, నెటిజన్ల మద్దతు లక్ష్మీనారాయణ కు లభించింది.

మరి ఇప్పటికైనా విజయసాయి రెడ్డి తన పంథా మార్చుకుంటాడా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close