బీజేపీ చేజారిపోయిన మరో రాష్ట్రం..!

భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రావడం లేదు. మొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో.. ఘన విజయాలు ఖాయమనుకున్న బొక్కా బోర్లా పడిన తర్వాత.. ఇప్పుడు జార్ఖండ్‌లోనూ అదే పరిస్థితి ఎదురయింది. అధికారాన్ని కోల్పోయింది. జార్ఖండ్‌లో ఐదు విడతలుగా జరిగిన ఎన్నికల ఫలితాల్లో.. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమి సింపుల్ మెజార్టీతో అధికారాన్ని దక్కించుకోవడం ఖాయం అయింది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ సింపుల్ మెజార్టీ అయిన 42 స్థానాలను.. కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ 29 స్థానాలకే పరిమితం కానున్నట్లు.. ట్రెండ్స్ చెబుతున్నాయి.

చాలా ఎగ్జిట్స్ పోల్స్‌లో కాంగ్రెస్ కూటమికే ఆధిక్యం కనిపించినప్పటికీ… బీజేపీని తక్కువ అంచనా వేయలేదు. హంగ్ ఏర్పడుతుదన్న అంచనా వేశాయి. అయితే.. కాంగ్రెస్ కూటమి.. కాస్త మెరుగైన ఫలితాల్ని సాధించింది. బీజేపీ చాలా దూరంలో నిలిచింది. కింగ్ మేకర్‌గా అవతరిస్తుందని భావించిన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అనుకున్న రీతిలో ఓట్లను.. సీట్లను చీల్చలేకపోవడంతో… పరిస్థితి తారుమారయింది. ఇండిపెండెంట్లు ఇతర పార్టీలు.. అన్నింటినీ కలుపుకున్నా.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రం అసాధ్యం.

పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని విజయం నమోదు చేసిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నట్లుగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో శివసేనతో కలిసి కూటమిగా పోటీ చేసి విజయం సాధించినప్పటికీ.. అక్కడ బీజేపీ లేని కూటమి అధికారంలోకి వచ్చింది. హర్యానాలో ఏకపక్ష విజయం వస్తుందనుకుంటే.. మరో మిత్రపక్షాన్ని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సాంకేతికంగా.. అక్కడ బీజేపీకి పరాజయమే. కానీ.. ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇప్పుడు జార్ఖండ్‌లోనూ ఎదురుదెబ్బ తగిలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close