రూ.2.5 లక్షల కోట్లతో జియో గిగా ఫైబర్..!. ఇక దేశాన్ని దున్నేయడమే..!

“జియో” భారతదేశ మొబైల్ డాటా రంగంలో ఓ విప్లవాన్ని సృష్టించింది. 4జీ సర్వీసుల పేరుతో ఇతర టెలికాం నెట‌్‌వర్కులు టూజీ స్పీడ్ కూడా అందివ్వలేని పరిస్థితుల్లో… జియో అద్భుతాలు సృష్టించింది. 4జీ ఇంటర్నెట్ సర్వీసులకు కొత్త అర్థం చెప్పింది. విశేషం ఏమిటంటే జియోకు 21 కోట్ల మంది చందాదారులున్నారు. వారిలో 80 శాతం మందికి తమ నెంబర్ ఎంతో గుర్తుండదు. కానీ జియో లేకుండా ఉండలేరు. అంటే.. అంతా డాటా మహిమే. టెలికాలం రంగంలో స్ట్రాంగ్ పిల్లర్స్ పడిపోవడంతో..ఇక ఇతర సర్వీసులపై దృష్టి సారించారు ముఖేష్ అంబానీ. వార్షిక చందాదార్ల సమావేశలో… ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ రంగంలో.. తమ ఎంట్రీని ఘనంగా ప్రకటించారు.. రిలయన్స్ రేంజ్‌కు ఏ మాత్రం తగ్గలేదు.. ఈ ప్రకటన.

రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఫైబర్‌తో కూడిన బ్రాండ్‌బ్యాండ్‌ సేవలను జియో గిగా ఫైబర్‌ ద్వారా అందించనుంది జియో సంస్థ. ఆగస్ట్‌ 15న మొత్తం 1100 నగరాల్లో దీని కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు. దేశంలోని 5 కోట్ల ఇళ్లకు ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించేలా ఏర్పాట్లు చేసింది జియో సంస్థ. ఈ జియో గిగా ఫైబర్‌తో ఐదు సేవలు లభిస్తాయి. అల్ట్రా హెచ్‌డీ సెట్ టాప్ బాక్స్, మల్టీపుల్‌ పార్టీ వీడియో కాన్ఫరెన్స్‌, ల్యాండ్‌లైన్‌ ఫోన్, సీసీ టీవీ సర్వైలెన్స్ సేవలు ఇంటర్నెట్‌తో పాటు లభిస్తాయి. ఇంట్లో ప్రతి గదిలో 1 జీబీ స్పీడ్‌తో వైఫై సేవలు లభిస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే స్మార్ట్‌ హోమ్‌ ఫీచర్స్‌ అన్నీ ఇందులో ఉంటాయి.

బ్రాడ్‌బ్యాండ్‌పై జియో దృష్టి సారించడం సంచలనంగా మారింది. ఎందుకంటే దేశంలో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తం మన దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు 7 శాతంగా ఉంటే అందులో ఫైబర్‌ సేవలు కేవలం 0.5 శాతం మాత్రమే. అదే చైనాలో 85 శాతం ఉన్నాయి. అందుకే జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌పై భారీగా పెట్టుబడులు పెట్టింది. జియో గిగా ఫైబర్‌కి టారిఫ్ ఎంతో ముఖేష్ అంబానీ ప్రకటించలేదు. జియో స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం… దేశంలో ఇప్పటికి అగ్రశ్రేణి కంపెనీలు ఉన్న వాటిని గడ్డు పరిస్థితి ఎదురుకాక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close