లాజిక్ ని ఏమార్చే అంబానీల మేజిక్!

* లాజిక్ ని ఏమార్చే అంబానీల మేజిక్!
* అన్నివిధాలా బిఎస్ఎన్ఎల్ మేలు
* అయినా రిలయెన్స్ జియో మీదే మోజు

గట్టిగట్టిగా మాట్లాడేసే మాజిక్ – లాజిక్ నితొక్కేస్తుంది… ఎపుడోగానీ నోరుతెరవని అంబానీలు మాట్లాడటం మొదలు పెట్టారంటే ”ఇదెలా సాధ్యం” అని ఆలోచనే రాకుండా చేసి ఆప్రాడక్టు కోసం జనాన్ని క్యూలో నుంచోపెట్టించేయగలరు. ఉచిత కాల్స్ జియో సిమ్ కార్డులకోసం ప్రతిచోటా కనబడుతున్న క్యూ ల వెనుక పెద్ద ”కమ్యూనికేషన్ మాయ” కనబడుతోంది.
సరకుఅమ్ముకునే వాడి మాటల్లో గారడీని వినియోగదారులు విశ్లేషించకునే ప్రయత్నం మొదలెట్టకముందే సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారే బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు, అంబానీల జియో ఫోన్ విశేషాన్ని ఆకాశానికి ఎత్తేయడమే క్యూలు పెరిగిపోడానికి మరో కారణం!

రిలయెన్స్ జియో ఫోన్లలో వాయిస్ కాల్స్ ఉచితం అన్న ప్రచారం నిజంకాదు. వీటి బిల్లు డేటా కాల్స్ లో కలిసిపోతూంది. డేటా కనెక్షన్ లేకుండా కేవలం కాల్స్ ఆప్షన్ తో మాత్రమే సిమ్ అమ్మగలిగితే వాళ్ళ ప్రచారం నిజమని నమ్మవచ్చు!

ఇంతేకాదు రిలయెన్స్ జియో ప్రకటించిన టారిఫ్ కంటే బిఎస్ఎన్ఎల్ టారిఫ్ లే తక్కువగా వున్నాయి. జియో చిన్న ప్లాన్ ప్ర‌కారం ఒక రోజు వ్య‌వ‌ధితో 100ఎంబీ డేటా ఆఫ‌ర్ చేస్తోంది. దాని ధర 19 రూపాయ‌లు. అయితే బీఎస్ఎన్ఎల్ 110 ఎంబీని కేవ‌ల 17 రూపాయ‌ల‌కు అంటే జియో క‌న్నా అద‌న‌పు డేటాను దానిక‌న్నా త‌క్కువ‌కే ఇస్తోంది.

ఒక నెల టైమ్ లిమిట్ తో జియో 149 రూపాయలకు 300 ఎంబీ డేటా ఇస్తుంది. అదే ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కేవ‌లం 109 రూపాయలకే ఇస్తోంది.

జియో 499రూ.ల ప్లాన్ లో ఒక నెలకు 4 జీబీ డేటా వ‌స్తుంది. బీఎస్ఎన్ఎల్ 10జీబీని కేవ‌లం 549రూ.ల‌కే అందిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంతేగాకుండా బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ లో 156రూ.ల‌కే 2జీబీ కూడా ఉంది. రిల‌యెన్స్ 10జీబీ 999రూ.ల‌కు అందిస్తోంది. కానీ బీఎస్ఎన్ఎల్ లో అదే ప్లాన్ ఖ‌రీదు 549 రూపాయలు మాత్రమే.

జియో లో అతిపెద్ద ప్లాన్ 4999రూ.లు. దానిద్వారా 75 జీబీ డేటా మూడు నెల‌ల వ్యవధిలో వాడుకోవచ్చు. కానీ, బీఎస్ఎన్ఎల్ 3జీ ప్లాన్ 3 నెల‌ల‌కు 3297 రూపాయలు మాత్ర‌మే.

రిల‌యెన్స్ జియోలో వాయిస్ కాల్స్ కూడా డేటా కేట‌గిరిలో లెక్క వేస్తున్నారు. అంటే త‌ద్వారా మీకు ఉచిత వాయిస్ కాల్స్ అని చెబుతున్న‌వ‌న్నీ డేటా ఆఫ‌ర్ కింద లెక్క‌లేస్తారు. వాయిస్ కాల్స్ ఖ‌ర్చును డేటా ప్యాకేజీ నుంచి ప‌రిగ‌ణిస్తారు.
అయినా అది చెప్ప‌కుండా పూర్తిగా ఉచితం అన్న‌ట్టుగా ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే బీఎస్ఎన్ఎల్ , జియో ఆఫ‌ర్ల‌లో ఒక్క తేడా వుంది. బీఎస్ఎన్ఎల్ ఆఫ‌ర్ల‌న్నీ 3జీ డేటా మాత్ర‌మే. జియో 4 జీ అని చెబుతోంది. కానీ వాస్త‌వం ఏమంటే 3జీ,4జీ మ‌ధ్య పెద్ద తేడా ఉండ‌దు. అయినా వేగం అందుకోవ‌డానికి మ‌న హ్యాండ్ సెట్లు దానికి త‌గ్గ‌ట్టుగా ఉండాలి. సాధార‌ణ హ్యాండ్ సెట్లలో కూడా 4జి వస్తుందన్నది భ్రమ మాత్రమే. ఊదరగొట్టిన రిలయెన్ జియో ప్రచారంవల్లే ఈ భ్రమ ఏర్పడింది.

ప్ర‌స్తుతం అక్క‌డ‌క్క‌డా మాత్ర‌మే జియో వాడుతుండ‌డంతో నెట్ స్పీడ్ బాగుంది. వాడకం పెరిగేకొద్దీ ఈ స్పీడ్ పతనమౌతుంది. వినియోగదారుల భ్రమలు కరికిపోతాయి. అప్పటికి రిలయెన్స్ జియో లక్ష్యంగా నిర్ణయించకున్న డబ్బులు వచ్చేస్తాయి.

బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వరంగ సంస్ధలు ఇచ్చేపోటీ – సేవల్లో, ధరల్లో వినియోగదారుల పక్షాన ప్రయివేటు రంగాన్ని అదుపు చేసేదిగా వుండాలి. అయితే స్వయంగా ప్రధానమంత్రే జియో విశేషాల్ని సుదీర్ఘంగా వివరించడం
రిలయెన్స్ పట్ల ఆయనలో వున్న అదుపులేని మోజును బయటపెట్టేసింది.

jio-no-cheaper-than-bsnl

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close