ప్రజల సొమ్ముతో పైశాచికత్వమా?

హాయిగా చదువుకోండి, బాగుపడండని ప్రభుత్వం విద్యాలయాలను స్థాపించింది. తక్కువ ఫీజులకు, లేదా ఫీజులే లేకుండా ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించింది. ఇది ప్రభుత్వం వారి గొప్ప కాదు. ఈ దేశంలో పన్నులు చెల్లించే వారి పుణ్యమా అని యూనివర్సిటీలకు నిధులు వస్తున్నాయి. విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు అందుతున్నాయి. మంచి ప్రొఫెసర్ల సేవలు అందుతున్నాయి. మంచి ఫర్నిచర్, నాణ్యమైన విద్య ఇవన్నీ అందుతున్నాయి. క్యాంటీన్లో సుష్టుగా తినడానికి తిండి దొరుకుతోంది.

అయినా, చదువును పక్కనబెట్టి దేశ ద్రోహులైన ఉగ్రవాదులను కీర్తించడమే పనిగా పెట్టుకున్న వారికి ఎందుకు ఈ సౌకర్యాలు కల్పించాలి? అఫ్జల్ గురు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాడు కాదు. పార్లమెంటుపై దాడికి స్కెచ్ వేసిన వాడు. మక్బూల్ భట్ కాశ్మీర్ లోయలో నరమేధానికి పాల్పడ్డ ఉగ్రవాది. వాళ్లను అమర వీరులంటూ కీర్తించే వాళ్లకి సిగ్గూ లజ్జా లేకపోవడం దారుణం.

కాశ్మీర్ కు స్వాతంత్ర్యం వచ్చే దాకా నిద్రపోం, పాకిస్తాన్ జిందాబాద్, హిందూస్తాన్ ముర్దాబాద్ అని నినాదాలు చేసిన విద్యార్థుల పైశాచికత్వాన్ని ఇంకా సహించాలా? అలాంటి వాళ్లపై చర్య తీసుకోకుండా శభాషని భుజం తట్టాలా? భరతమాతను భలే తిట్టారని ముద్దు పెట్టుకోవాలా? రాహుల్ గాంధీ గానీ, కమ్యూనిస్టు నాయకులు గానీ ఏం కోరుతున్నారో, దేనికి మద్దతు చెప్తున్నారో అర్థం కావడం లేదు. అసలు ఈ రావణ కాష్టం ఆగిపోకుండా అగ్నికి ఆజ్యం పోసేది కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులే అని దేశ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది. మాజీ సైనికులు, అమర వీరుల కుటుంబ సభ్యుల, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, ఇంకా ఎంతో మంది తమకు అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా ఈ జాతి వ్యతిరేకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు మాత్రం దేశ ద్రోహానికి పాల్పడ్డ విద్యార్థులకు మద్దతు చెప్తూనే ఉన్నారు.

మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు, దేశాన్ని ముక్కలు చేస్తామనే వారు తక్కువ ఫీజుతో విద్యకు అర్హులు ఎలా అవుతారు? మనం చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత ఆదాయ పన్ను రూపంలో, ఇతర పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. ఆ సొమ్ము ఇలాంటి అచ్చోసిన ఆంబోతుల్లాంటి జాతిద్రోహుల సౌకర్యం కోసం వెచ్చిస్తామంటే మనమెలా ఒప్పుకుంటాం? హాయిగా చదువుకొమ్మంటే తిన్నది అరగకుండా దేశ ద్రోహానికి పాల్పడే వారి కోసం మన కష్టార్జితాన్ని వృథా చేయవద్దని ప్రభుత్వాన్ని కోరడంలో తప్పు లేదు. ఆకలితో ఉన్న వారికి, రైతులకు, అవసరమైన ఇతర వర్గాల వారికోసం మన సొమ్మును ఖర్చు పెట్టాలని డిమాండ్ చేసే హక్కు మనకుంది. చదువు మానేసి టెర్రరిస్టులుగా మారాలనుకునే వాళ్లకు క్యాంపస్ లో ఏం పని? వాళ్లను వెనకుండి నడిపే నాయకులకు దేశం పట్ల, చట్టాల పట్ల గౌరవం లేనప్పుడు ఇలాంటి వాళ్లే తయారవుతారు. అయితే, జనం తిరగబడిన నాడు వీళ్లూ, వీళ్ల వెనకున్న వాళ్లూ ఏమవుతారో ఆలోచించుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close