ప‌వ‌న్‌.. జోకులేయ‌మ‌క‌య్యా!

ఇండ్ర‌స్ట్రీలో ఓ కొత్త జోకు షికారు చేస్తోంది. అదీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా గురించి. డాలీతో తీస్తున్న త‌న కొత్త సినిమాని నాలుగు నెల‌ల్లో పూర్తి చేసి.. జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్ చేయ‌మ‌ని ప‌వ‌న్ ఆర్డ‌రు వేశాడ‌ట‌. ఒక‌వేళ ఆయ‌న ఆర్డ‌రు నిజంగానే వేశాడ‌నుకోండి. అంత‌కంటే జోకు ఇంకోటి ఉండ‌దు గాక ఉండ‌దు. ఎందుకంటే ప‌వ‌న్ ఎంత స్లోనో ఆయ‌న అభిమానుల‌కు కూడా తెలుసు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ విడుద‌లై… ఇంత‌కాల‌మైనా ఆయ‌న సినిమాకి రంగం సిద్ధ‌మైనా ఇప్ప‌టి వ‌ర‌కూ సెట్స్‌పైకి వెళ్లిందే లేదు. అయితే ప‌వ‌న్ మాత్రం త‌న సినిమాని సంక్రాంతి బ‌రిలో నిల‌పాల‌ని చూస్తున్నాడ‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ప‌వ‌న్‌కు ఆ ఉద్దేశం ఉన్నా… ఈ సినిమా సంక్రాంతికి రావ‌డం అసాధ్య‌మే.

ప‌వ‌న్ బేసిగ్గా మూడిస్ట్‌. త‌న‌కు న‌చ్చితే సెట్స్ కి వెళ్తాడు లేదంటే లేదు. చుట్టూ ఎక్కువ మంది ఉన్నారంటే డైలాగులు చెప్ప‌డ‌ట‌. ఈ విష‌యాన్ని ప‌వ‌నే స్వ‌యంగా చాలా సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక డాన్సులు స‌రే స‌రి. ప‌వ‌న్ సినిమా మొద‌లెట్టాడంటే పూర్త‌యి బ‌య‌ట‌కు రావ‌డానికి క‌నీసం యేడాది ప‌డుతుంది. ఇంత‌కంటే తక్కువ టైమ్‌లో సినిమా పూర్తి చేసిన సంద‌ర్భం ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక‌టీ అరా ఉంటాయేమో… అంతే. పైగా ఇప్పుడు పొలిటిక‌ల్‌గానూ ప‌వ‌న్ బిజీ అవుదామ‌నుకొంటున్నాడు. ఈ నేప‌థ్యంలో నాలుగు నెల‌ల్లో సినిమా పూర్తి చేయ‌డం క‌ష్టం. చిరు, బాల‌య్య సినిమాలు రెండూ సంక్రాంతికి వ‌ద్దామ‌ని ప్రిపేర్ అవుతున్నాయి. పైగా షూటింగ్ కూడా ఎంతో కొంత జ‌రిగింది కూడా. ఈలోగా మ‌ధ్య‌లో ప‌వ‌న్ వ‌చ్చి.. సినిమా పూర్తి చేసేద్దాం అంటే ఎట్టా?? ప‌వ‌న్ – డాలీ సినిమా మార్చిలో విడుద‌లైనా గొప్పే. కాదంటారా..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close