గ్యారేజీతో పెట్టుకొంటే క‌ష్ట‌మే మ‌రి!

మంచి సినిమా తీయ‌డం ఎంత ముఖ్య‌మో, స‌రైన స‌మ‌యంలో విడుద‌ల చేసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. అందుకే రిలీజ్ డేట్ విష‌యంలో నిర్మాత‌లు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పెద్ద సినిమాలేవీ పోటీ లేకుండా చూసుకొంటున్నారు. ఒక‌వేళ మ‌రో సినిమాతో ఢీ కొట్టాల్సివ‌స్తే… ఆచి తూచి స్పందిస్తున్నారు. ఇద్ద‌రు నిర్మాత‌లు కూర్చుని మాట్లాడుకొని, ఓ అంగీకారానికి వ‌చ్చి.. సినిమా సినిమాకీ మ‌ద్య గ్యాప్ వ‌చ్చేలా చూసుకొంటున్నారు. ఇంత చేసినా.. అప్పుడ‌ప్పుడూ రెండు సినిమాల మ‌ధ్య క్లాష్ వ‌స్తూనే ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్‌, నాగ‌చైత‌న్య సినిమాల‌కూ అదే పరిస్థితి ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని టాలీవుడ్ టాక్‌.

ఎన్టీఆర్ న‌టిస్తున్న జ‌న‌తా గ్యారేజ్ ఇప్పుడు షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఆగ‌స్టు 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ఎప్పుడో చెప్పేసింది. ఆ డేట్‌.. జ‌న‌తా గ్యారేజ్ రిజ‌ర్వ్ చేసుకొని చాలా కాల‌మైంది. ఇప్పుడు నాగచైతన్య ప్రేమ‌మ్ కూడా ఆగ‌స్టు 12నే గురి పెట్టింది. త‌మ సినిమానీ అదే రోజు విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తోంద‌ట‌. ఎన్టీఆర్ సినిమా వ‌స్తోంది క‌దా.. అని చెబుతున్నా ప్రేమ‌మ్ టీమ్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. బ‌హుశా.. జ‌న‌తా గ్యారేజీ అప్ప‌టికి విడుద‌ల కాద‌న్న ధీమానో, ఏమో?! అయితే ప్రేమ‌మ్ ఆల్మోస్ట్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఆగ‌స్టు వ‌ర‌కూ ఆగ‌న‌వ‌స‌రం లేదు. మ‌రెందుకు ఆగ‌స్టు 12న టార్గెట్ చేశారో?! ప‌నిగ‌ట్టుకొని ఎన్టీఆర్ సినిమాతో పెట్టుకొంటే మాత్రం చైతూ సినిమాకి కష్టాలు త‌ప్ప‌వు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close