ఆ సినిమా ఎన్.టి.ఆర్ చేయట్లేదట

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా నాన్నకు ప్రేమతో.. సుకుమార్ డైరక్షన్లో చేస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్, కొరటాల శివ డైరక్షన్లో ‘జనతా గ్యారేజ్’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ముహుర్తం పెట్టిన సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ కోలీవుడ్ అజిత్ రీసెంట్ హిట్ వేదలం సినిమా రీమేక్ చెస్తున్నాడని వార్తలు వచ్చాయి.

అజిత్ సినిమా చూసిన ఎన్.టి.ఆర్ బాగుంది అని చెప్పడంతో స్టార్ట్ అయిన ఈ రూమర్ ఎన్.టి.ఆర్ వేదలం తెలుగు రీమేక్ చేస్తున్నాడని మీడియా నానా రచ్చ చేసేలా చేసింది. అంతేకాదు కత్తి సినిమా గురించి కూడా ఎన్.టి.ఆర్ చేద్దామనే ఊపులో ఉన్నాడని అప్పట్లో అన్నారు. అయితే వీటన్నిటికి వివరణ ఇస్తూ ఎన్.టి.ఆర్ తన సన్నిహితులతో మాట్లాడాడట.. తను ఏ రీమేక్ సినిమా చేయబోవట్లేదని.. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలన్ని కంప్లీట్ చేసి గాని తర్వాత సినిమాల గురించి ఆలోచిస్తానని అన్నాడట.

సో కత్తి పట్టనున్న ఎన్.టి.ఆర్, మరోసారి సిస్టర్ సెంటిమెంట్ తో యంగ్ టైగర్ అంటూ హడావిడి చేసిన మీడియా వారందరికి ఇది ఓ చల్లని కబురన్నమాట. సినిమా చేస్తాడా లేదా అన్నది పక్కన పెడితే ఆ సినిమాలు ఎన్.టి.ఆర్ చేస్తే దర్శకులెవరు, హీరోయిన్ ఎవరు అని మీడియా ఉత్సాహం చూపించడం జరిగింది. మరి ఎన్.టి.ఆర్ లీక్ చేసిన ఈ న్యూస్ వారందరికి షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close