తాత‌య్య పాత్ర చేసే ద‌మ్ము నాకు లేదు: ఎన్టీఆర్‌

మ‌హాన‌టిలో ఎన్టీఆర్ పాత్ర కోసం జూనియ‌ర్‌ని సంప్ర‌దించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఎన్టీఆర్ అంగీక‌రించ‌లేదు. అశ్వ‌నీద‌త్ ఎంత బ‌తిమాలాడినా.. ఎన్టీఆర్ స‌సేమీరా అన్నాడు. ఎన్టీఆర్ కోసం ఎదురుచూసీ ఎదురుచూసీ.. ఆ పాత్ర‌ని అలాగే వ‌దిలేసుకోవాల్సివ‌చ్చింది. ఎన్టీఆర్ పాత్ర‌ని ఎందుకు చేయ‌లేదో.. `మ‌హాన‌టి` ఆడియో ఫంక్ష‌న్‌లో వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు ఎన్టీఆర్‌. ”స్వ‌ప్న నాకు మంచి స్నేహితురాలు. త‌ను అడిగితే ఏదీకాద‌న‌లేదు. ఓసారి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి తాత‌య్య పాత్ర చేయ‌మ‌ని అడిగింది. నేను ఒప్పుకోలేదు. తాత‌య్య పాత్ర చేసే ధైర్యం, ద‌మ్ము నాకు లేవు. ఈ జ‌న్మ‌కురావు. మ‌న క‌ళ్ల ముందు తిరిగిన ఓవ్య‌క్తి జీవిత పాత్ర‌ని పోషించ‌డం సుల‌భం కాదు. కీర్తి సురేష్‌, స‌ల్మాన్ దుల్క‌ర్‌, స‌మంత ఆ సాహ‌సం చేశారు. వాళ్ల‌ని అభినందిస్తున్నా” అన్నాడు. సావిత్రి క‌థ ఈ త‌రం తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఈ సినిమా చూశాక ఆడ‌వారిపై గౌర‌వం క‌లుగుతుంద‌న్నాడు ఎన్టీఆర్‌. ”ఈమ‌ధ్య స‌మాజంలో ఆడ‌వాళ్ల‌పై కొన్ని అకృత్యాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా చూస్తే మాత్రం ఆడ‌వాళ్ల‌పై గౌర‌వం పెరుగుతుంది. మ‌గాడిగా ఎందుకు పుట్టామా అనిపిస్తుంది” అని ఉద్వేగంగా మాట్లాడాడు ఎన్టీఆర్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close