ఆతిధ్యంలో ఏపీ స్టాండర్డ్‌ అంతేనా..?

ఆంధ్రప్రదేశ్‌ వైపు దేశం క్రీడాలోకం మొత్తం తిరిగి చూసింది. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో జరుగుతున్న జాతీయ జూనియర్ అధ్లెటిక్స్ చాంపియన్ షిప్ వైపు.. నిబిడాశ్చర్యంతో చూస్తోంది. దీనికి కారణం.. అక్కడ ఉసెన్ బోల్ట్ రికార్డులు బద్దలవడం కాదు. అధ్లెటిక్స్‌లో ధృవతారను గుర్తించడం కూడా కాదు. దేశ క్రీడాలోకం మొత్తం ఏపీ వైపు చూసింది.. ఆ కోణంలో కాదు… ఆతిధ్య కోణంలో. కనీసం మంచినీళ్లు కూడా.. క్రీడాకారుల కోసం ఏర్పాటు చేయని తీరు గురించి.. చర్చించుకుంటున్నారు.

జాతీయ జూనియర్ అధ్లెటిక్స్ అంటే… ప్రాధాన్యతాపరంగా.. కీలకమైన గేమ్స్. ముందుగానే ఈవెంట్‌కు సంబంధించి.. ఆటగాళ్లు, టీముల కోసం.. వసతి ఏర్పాట్లు చేసి ఉంటారు. వసతి నుంచి ఆటలు జరిగే ప్రదేశానికి రవాణా సౌకర్యాలు, గ్రౌండ్‌లో తాత్కాలికంగా అయినా ఆటగాళ్లు సేదదీరేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అదీ కూడా జాతీయ స్థాయి జాతీయ జూనియర్ అధ్లెటిక్స్ చాంపియన్ షిప్ అంటే.. మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ.. అసలు ఈ గేమ్స్ అంటే..ఏవో గల్లీ ఆటలు అనుకున్నాయి ప్రభుత్వ వర్గాలు. పూర్తిగా లైట్ తీసుకున్నాయి. వివిధ రాష్ట్రాల జట్లు విజయవాడ చేరుకునేవరకు.. క్రీడాశాఖ.. కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు.

ఆటగాళ్లు విజయవాడ వచ్చిన తర్వాత.. ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ.. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ పేరుతో వెయిట్ చేయించారు. తర్వాత అందరికీ.. ఓ హాల్ లాంటిది చూపించి.. అక్కడే బస చేయమన్నారు. అందరూ కనీసం దుప్పటి కూడా లేకుండా కింద పడుకోమని సూచించారు. కావాలంటే.. సొంత ఖర్చులతో లాడ్జిలలో రూములు తీసుకోమని సలహా ఇచ్చారు. ఆ తర్వాత నాగార్జున యూనివర్శిటీలో.. ఉన్న.. పోటీలు జరిగే ప్రదేశానికి.. తీసుకెళ్లడానికి రవాణా ఏర్పాట్లు చేయలేదు. ఎలాగోలా తంటాలు పడి అక్కడకు వెళ్తే.. చెట్ల కిందనే… డ్రెస్సులు చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. పెవిలియన్లు, డ్రెస్సింగ్ రూములు అన్నీ చెట్ల కిందనే. అక్కడంతా వర్షం పడి.. బురదబురదగా ఉంది. ఇన్ని చేసినోళ్లు భోజనాలు మాత్రం ఎందుకు పెడతారు..? వాటినీ లైట్ తీసుకున్నారు.

దేశంలో చాలా ప్రాంతాలకు ఆటల నిమిత్తం వెళ్లిన … క్రీడాకారులు.. ఈ పరిస్థితి చూసి.. ఖంగుతున్నారు. ఇంత దారుణమైన ఏర్పాట్ల చేయడం ఏమిటని…నేరుగా కేంద్రక్రీడా మంత్రిత్వశాఖకు, పీఎంవోకు ట్వీట్ల ద్వారాఫిర్యాదు చేశారు. వాటికి తాము ఎదుర్కొన్న పరిస్థితుల ఫోటోలను కూడా జత చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close