యూట్యూబ్‌లో పాఠాలు చెప్పబోతున్న కె.రాఘవేంద్రరావు, బి.ఎ.

హైదరాబాద్: దర్శక దిగ్గజం కె. రాఘవేంద్రరావు తన ప్రతిభను పదిమందికీ ఉచితంగా పంచాలని నిర్ణయించుకున్నారు. దర్శకులు కావాలనుకునేవారు, దర్శకత్వం గురించి తెలుసుకోవాలనుకునేవారికోసం ‘కేఆర్ఆర్ క్లాస్ రూమ్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో పాఠాలు చెప్పబోతున్నారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టారు. కేఆర్ఆర్ క్లాస్ రూమ్‌కు ‘ప్రాక్టికాలిటీ ఇన్ ఫిల్మ్ డైరెక్షన్’ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. క్లాసులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని, చూస్తూ ఉండాలని పేర్కొన్నారు. సినిమా కార్యక్రమాలలో, సభలలో వేదికపై ఎక్కడా నోరు విప్పని రాఘవేంద్రరావు, ఆ మధ్య ‘ఈటీవీ తెలుగు’లో ప్రసారమైన ‘సౌందర్యలహరి’ అనే కార్యక్రమం ద్వారా తన అనుభవాలను వెల్లడించటంతోపాటు, తెరవెనుక తాను చేసిన కృషిని కూడా వివరించారు. ఆ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది… చిత్రపరిశ్రమలోనివారందరూ జేజేలు పలికారు. ముందు తరాలవారికి ఇది బాగా సాయపడుతుందని ప్రశంసించారు. ఆ స్ఫూర్తితోనే దర్శకేంద్రుడు ఈ యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి పూనుకున్నట్లు కనబడుతోంది. KRR

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close