వరంగల్ రివ్యూ: స్టేషన్ ఘన్‌పూర్ లో ఏం జరుగుతోంది..?

వరంగల్ జిల్లాలో… స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్యను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. అప్పట్నుంచి కడియం శ్రీహరి వర్గం అసమ్మతిని తీవ్ర స్థాయిలో వ్యక్తం చేస్తోంది. చివరికి కడయం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఆయన పదే పదే తాను కాంగ్రెస్ లో చేరడం లేదని చెప్పుకుంటున్నారు. తాటికొండ రాజయ్యకు.. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్ ఇవ్వరని.. తానే అభ్యర్థి అని కడియం చాలా కాలాంగా నమ్మకంతో ఉన్నారు. ఒక వేళ తనకు కాకపోతే.. తన కుమార్తెకు అయినా సీటు ఇప్పించుకోవాలనుకున్నారు. కడియం శ్రీహరి తన కూతురు కావ్యను రాజకీయ ఆరంగేట్రం చేయించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. బయటకు చెప్పకపోయినా స్టేషన్ ఘన్‌పూర్‌లో తమ కూతురు కావ్య పోటీలో ఉండేలా కార్యకర్తలను గత రెండేళ్లుగా సన్నద్ధం చేశారు.

ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజయ్యపై ఉన్న వ్యతిరేకత కారణంగా కేసీఆర్ ఆయనకు టిక్కెట్ ఇవ్వరంటూ ప్రచారం చేసి ఆ తర్వాత కడియం కావ్యను రంగంలోకి దించేందుకు రెడీ అయిపోయారు. రెండేళ్లుగా నియోజకవర్గంలోని పల్లెపల్లెనా కడియం కావ్య ప్రచారం చేశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా చూసుకోవడం వంటి ప్రయోగాలు చేశారు. అయినా కేసీఆర్ నిర్ణయంతో ఆ ప్రయత్నాలన్నీ వీగిపోయాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌ అభ్యర్థిగా రాజయ్యను ప్రకటించాక వాతావరణం వేడెక్కింది. అసమ్మతి నేతలంతా బహిరంగసభలు నిర్వహించారు. అటునుంచి కేటీఆర్ వద్దకు వెళ్లి తమకు రాజయ్య వద్దని విన్నవించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినా టీఆర్‌ఎస్‌ అధిష్టానం మాత్రం దిగిరాలేదు. సరికదా.. కడియంను పిలిచి ఒక లెవల్లో మందలించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కడియం శ్రీహరి పార్టీ మారుతారంటూ ప్రచారం కూడా జరిగింది. తన శిష్యురాలైన సత్యవతి రాథోడ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

తన కూతురు కడియం కావ్యకు స్టేషన్ ఘన్‌పూర్ లేదా వర్ధన్నపేట నియోజకవర్గాలలో ఏదో ఒక టిక్కెట్ ఇప్పించుకోవడం కోసం కడియం మంత్రాంగం చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని శ్రీహరి కొట్టి పడేస్తున్నారు. కానీ అంతర్గతంగా… కాంగ్రెస్‌లో చేరకపోతే… తాను ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని.. కూతురుతో చెప్పిస్తున్నారు. కార్యకర్తకు అదే చెబుతున్నారు. దీంతో.. స్టేషన్ ఘన్ పూర్‌లో … ముందు ముందు చాలా కీలక పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close