ఊటీ షూట్ లో కాజల్ కేరింత

మొన్నటిదాకా దాదాపు అమ్మడు పని అయిపోయింది అని అనుకున్నారంతా కాని చమక్కుల చందమామ ఇంకా సోయగాలు పోతూనే తనలో ఇంకా మెరుపులు ఉన్నాయంటూ ఊరిస్తుంది కాజల్. స్టార్ హీరోలందరితో నటించినా ఒక్క పవర్ స్టార్ తో నటించలేదన్న లోటు ఉండేసరికి అది కాస్తా సర్ధార్ తో తీరేలా చేసుకుని ఆ సినిమాతో సమానంగా సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ లో కూడా పాలుగొంటుంది కాజల్. సర్ధార్ తన పార్ట్ షూట్ అయ్యాక కాస్త ఆ సెట్ కి బ్రేక్ ఇచ్చి బ్రహ్మోత్సవం యూనిట్ తో జాయిన్ అయ్యింది ఈ భామ.

బ్రహ్మోత్సవంలో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న కాజల్ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉంది. ప్రస్తుతం ఊటీలో మహేష్ తో షూట్ లో పాల్గొన్న అమ్మడు షూటింగ్ గ్యాప్ లో ఇలా కేరింతలు కొడుతూ కనిపించింది. పాలనురుగు అందాలతో పరవశింప చేస్తున్న కాజల్ అందం ఎన్నటికి తరిగిపోదు కరిగిపోదు అంటే నమ్మాలి. మొన్నామధ్య అమ్మడు కెరియర్ ముగింపుకు వచ్చిందని నానా హడావిడి చేసినా మీడియానే ఇలానే జోరు మీదుంటే మరో పది సంవత్సరాలు అమ్మడికి ఢోకా లేదంటున్నారు.

అది కాజల్ అంటే. ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూట్ లో ఓ పార్క్ లో అమ్మడు పై విధంగా కేరింతలు కొట్టడం అక్కడ మీడియా కంట పడ్డది. అమ్మడికి ఎందుకీ చెప్పలేనంత ఆనందం అని ఆలోచనలో పడ్డారు. అయితే ఇద్దరు సూపర్ స్టార్స్ సినిమాల్లో నటించడం కన్నా సంతోషమైన విషయం ఇంకేముంటుంది చెప్పండి అని ఎవరికి వారే సమాధానం చెప్పేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close