నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జెట్ స్పీడులో ఉన్నారు. ఒకేసారి రెండు ప్రాజెక్టుల్ని సమాంతరంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమాని పట్టాలెక్కించారు. రెండో సినిమా ఎప్పుడు? ఎవరితో అనేది త్వరలో తెలుస్తుంది.
గోపీచంద్ మలినేని సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలైంది. తొలుత ఓ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు ఛాన్స్ ఉంది. ఓ కథానాయికగా నయనతార ఎంపిక ఎప్పుడో ఖరారైపోయింది. రెండో నాయికగా కాజల్ ని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. కాజల్ తో బాలయ్యకు ఇది రెండో సినిమా. ఇది వరకు ‘భగవంత్ కేసరి’ సినిమాలో ఇద్దరూ జోడీగా నటించారు. అయితే… అందులో కాజల్ ది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ ఏం కాదు. కాకపోతే.. ఈ సినిమాలో కాజల్ పాత్రకూ చాలా ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. వృద్ది సినిమాస్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తోంది. ఈ యేడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. బాలయ్య – గోపీచంద్ కాంబోలో ఇది వరకు ‘వీర సింహారెడ్డి’ వచ్చి, సూపర్ సక్సెస్ కొట్టింది. ఇది రెండో ప్రాజెక్ట్. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టైటిల్ తో పాటుగా త్వరలో ఓ గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉంది.
