క‌మ‌ల్‌తో లిప్పులాక్కుల‌కు కాజ‌ల్ సిద్ధ‌మేనా?

క‌మ‌ల్ హాస‌న్ సినిమా అంటే… ఏది ఉన్నా, లేకున్నా – లిప్పులాక్కుల‌కు మాత్రం కొద‌వ ఉండ‌దు. హీరోయిన్ల పెద‌వి ఎంగిలి చేయ‌డం క‌మ‌ల్‌కి ఓ అల‌వాటుగా మారింది. క‌మ‌ల్‌తో సినిమా అంటే.. ముందు ఉత్సాహ ప‌డే క‌థానాయిక‌లు, లిప్ లాక్కుల ద‌గ్గ‌రే భ‌య‌ప‌డిపోతుంటారు. అయితే… క‌మ‌ల్ సినిమా వ‌దులుకోకూడ‌ద‌న్న ఉద్దేశంతో వాటికీ ఓకే చెప్పేస్తుంటారు. ఇప్పుడు కాజ‌ల్ కూడా క‌మ‌ల్ పెద‌వెంగిలి సీన్ల‌కు రెడీ అయిపోయిన‌ట్టు స‌మాచారం.

క‌మ‌ల్‌హాస‌న్ – శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `ఇండియ‌న్ 2`. ఈసినిమాలో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. క‌మ‌ల్‌తో న‌టించ‌డం కాజ‌ల్ కి ఇదే తొలిసారి. స్వ‌త‌హాగా లిప్ లాక్ లాంటి స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి అంగీక‌రించ‌దు కాజ‌ల్‌. త‌ను న‌టించిన లిప్ లాక్ స‌న్నివేశాల్ని వేళ్ల మీదే లెక్క పెట్టొచ్చు. భార‌తీయుడులో లిప్ లాక్ అవ‌స‌రం చాలా ఉంద‌ట‌. ఆ స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి ఒప్పుకుంటేనే సంత‌కాలు చేయ‌మ‌ని చిత్ర‌బృందం అడిగింద‌ట‌. దానికి కాజ‌ల్ కూడా రెడీ అయిపోయింద‌ని స‌మాచారం. అన్న‌ట్టు ఈ సినిమాలో ర‌కుల్‌కీ ఛాన్స్ దొరికింది. అప్ప‌టి భార‌తీయుడులో ఊర్మిళ‌, మ‌నీషా కొయిరాల‌తో రొమాన్స్ చేశాడు క‌మ‌ల్‌. ఈసారీ ఇద్ద‌రు భామ‌ల్ని ఎంచుకున్నాడు. కాజ‌ల్‌తో స‌ర‌సాలు సాగించే క‌మ‌ల్‌.. ర‌కుల్‌ని వ‌దిలిపెడ‌తాడో, లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close