అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కలిఖో పౌల్ ప్రమాణ స్వీకారం

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు నిన్న ముగిసిపోయింది. కేంద్రం సలహా మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ రాష్ట్రంలో అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను శుక్రవారం ఎత్తివేశారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఆ పార్టీ నేత కలిఖో పౌల్ చేత నిన్న గవర్నర్ జెపి.రాజ్ ఖోవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికయిన తమ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రోద్బలంతో కుట్ర పన్ని కూల్చివేసినందుకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి నబం తుకి ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కలిఖో పౌల్ కి కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది, బీజేపీకి చెందిన 11మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. కలిఖో పౌల్ ప్రభుత్వానికి తమ పార్టీ బయట నుండి మద్దతు ఇస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నేత తమియో తగ తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com