హిట్ కొట్టినా ఛాన్స్ ఇవ్వట్లేదు..!

లోకనాయకుడు కమల్ హాసన్ తనయురాలిగా తెరంగేట్రం చేసిన శృతి హాసన్ కెరియర్ మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా ఆ తర్వాత ఫుల్ స్వింగ్ లోకి వచ్చింది. శృతి ఉంటే సినిమా హిట్టే అన్న పరిస్థితి వచ్చింది అంతకంత క్రేజ్ సంపాధించింది ఈ బ్యూటీ.. అయితే లాస్ట్ ఇయర్ శ్రీమంతుడు హిట్ కొట్టినా శృతి హాసన్ కు తెలుగులో ఒక్క ప్రేమమ్ తప్ప ఏ సినిమా ఆఫర్ రాలేదు. ఊపిరి సినిమాకు తమన్నా పాత్రలో ముందు శృతి హాసన్ అనుకున్నా ఆమె చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది.

స్టార్ హీరోలందరితో హిట్ కొట్టిన శృతి హాసన్ ను ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు అన్నది అర్ధం కాని విషయం. ఇప్పటికే సమంత స్టార్ హీరోలతో వరుసెంట రెండు మూడు సినిమాల్లో నటించేస్తుంటే శృతి హాసన్ మాత్రం ఒక్క సినిమాతో సరిపెట్టుకుంటుంది. శృతిని స్టార్ హీరోలే కావాలని అవైడ్ చేస్తున్నారా లేక ఆమె తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తమిళంలో రెండు మూడు సినిమాలతో హడావిడి చేస్తున్న శృతి తెలుగులో ప్రేమమ్ తప్ప మరే సినిమాకు కమిట్ అవ్వలేదు కనీసం చర్చలు కూడా జరుపలేదు.

ఇక సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటేందుకు అడపా దడపా ప్రయత్నాలు చేస్తూనే ఉంది శృతి. రీసెంట్ గా వచ్చిన రాకీ హ్యాండ్సంలో జాన్ అబ్రహంతో జత కట్టిన శృతి హాసన్ ఆ సినిమాలో పది నిమిషాల పాత్రకే పరిమితం అయ్యింది. కేవలం శృతి హాసన్ తన మాత్రు భాషలోనే సినిమాలు చేయాలనుకుంటుందా..? తెలుగులో అవకాశాలు వచ్చినా కాదని చెబుతుందా..? అన్న సందేహాలు వస్తున్నాయి. వీటికి సమాధానాలు దొరకాలంటే శృతి హాసన్ నోరు విప్పితేనే తెలుస్తుంది మరి.
Quick Reply

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close