కొత్త కాంబో: క‌ల్యాణ్‌రామ్ తో స‌తీష్ వేగ్నేశ‌

మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌పై దృష్టి సారించే క‌ల్యాణ్ రామ్ ఈమ‌ధ్య రూటు మార్చాడు. `118`తో ఓ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. అది మంచి ఫ‌లితం ఇచ్చింది. `తుగ్ల‌క్‌`తో మ‌ళ్లీ క‌మ‌ర్షియ‌ల్ బాట ప‌ట్టాడు. మ‌ల్లిడి వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మాస్ మ‌సాలా అంశాలు ఎక్కువ ఉండ‌బోతున్నాయి. అందుకే క‌ల్యాణ్ రామ్ మ‌ళ్లీ రూటు మార్చారు. త‌న త‌దుప‌రి చిత్రం.. కుటుంబ క‌థా నేప‌థ్యంలో ఉంటే బాగుంటుంద‌ని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఓ క‌థ‌ని ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క‌థ‌ని స‌తీష్ వేగ్న‌శ సిద్ధం చేశార‌ని తెలుస్తోంది. ర‌చ‌యిత‌గా పేరు తెచ్చుకున్న స‌తీష్ వేగ్నేశ శ‌త‌మానం భ‌వతితో ద‌ర్శ‌కుడిగానూ రాణించారు. అందులో కుటుంబ బంధాల్ని ఆవిష్క‌రించిన తీరు అంద‌రికీ న‌చ్చింది. ఈసారి కూడా ఆయ‌న ఫ్యామిలీ డ్రామానే చూపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. తుగ్ల‌క్ పూర్త‌యిన వెంట‌నే ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. విరించి వ‌ర్మ‌తో క‌ల్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రి ఆ కాంబో ఎప్పుడు మొద‌ల‌వుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close