క‌ల్యాణ్‌రామ్ సినిమాకి భ‌లే రేటు

ప‌టాస్‌, ఎం.ఎల్‌.ఏ సినిమాల‌తో రేసులోకి వ‌చ్చాడు నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్‌. ఈ రెండు సినిమాల‌తో బీసీల్లో క‌ల్యాణ్ రామ్ సినిమాకి మంచి గిరాకీ ఏర్ప‌డింది. ఈ ఎఫెక్ట్ నా నువ్వే సినిమాపై ప‌డింది. జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న నా నువ్వే షూటింగ్ పూర్త‌య్యింది. ఈ సినిమా సెట్లో ఉన్న‌ప్పుడే శాటిలైట్ డిజిట‌ల్ రైట్స్ అమ్ముడైపోయాయి. జెమిని టీవీ రూ.4.75 కోట్ల‌తో శాటిలైట్ హ‌క్కుల్ని ద‌క్కించుకుంది. హిందీ రైట్స్ రూపంలో మ‌రో రూ.3 కోట్లు వ‌చ్చాయి. డిజిట‌ల్ రైట్స్ రూపంలో మొత్తంగా రూ.8 కోట్ల వ‌ర‌కూ త‌న ఖాతాలో వేసుకుందీ సినిమా. త‌మ‌న్నా క‌థానాయిక కావ‌డం, టెక్నిక‌ల్‌గా పీసీ శ్రీ‌రామ్ లాంటి వాళ్ల స‌పోర్ట్ దొర‌క‌డంతో ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక ఏరియాల వారిగా… క‌ల్యాణ్‌రామ్ సినిమాకి ఎలాంటి రేటు ద‌క్కుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close