లారెన్స్ అక్క‌డ‌… టాక్‌తో ప‌నిలేదు ఇక్క‌డ‌!

ఓ సినిమాకి హిట్ టాక్ రావ‌డం చాలా గ‌గ‌నం. అలా వ‌చ్చిన సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాసుల వ‌ర్షం కురిపించుకుంటుంద‌న్న రూలు లేదు. `సినిమా బాగానే ఉంది` అన్న‌ప్ప‌టికీ వ‌సూళ్లు దారుణంగా ఉండ‌డం చిత్ర‌సీమ‌లో చాలా సాధార‌ణ‌మైన విష‌యం. `ఈ సినిమా బాలేదు.. చెత్త‌` అని విమ‌ర్శ‌కులు డిక్లేర్ చేస్తే ఇక చెప్ప‌క్క‌ర్లెద్దు. అయితే కొన్ని సినిమాల‌కు టాక్ తో ప‌ని ఉండ‌దు. సినిమా ఎలా ఉన్నా – థియేట‌ర్లు నిండిపోతుంటాయి. `కాంచ‌న 3` దీనికి ఓ పెద్ద ఉదాహ‌ర‌ణ‌.

శుక్ర‌వారం విడుద‌లైన రెండు సినిమాల్లో `కాంచ‌న 3` ఒక‌టి. ఓ వైపు `జెర్సీ`కి అద్భుత‌మైన రివ్యూలొచ్చాయి. ఈ సినిమాకి క్లాసిక్‌గా విమ‌ర్శ‌కులు తేల్చేస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే జెర్సీకి మంచి వ‌సూళ్లు ద‌క్కుతున్నాయి. అయితే విచిత్రంగా జెర్సీతో పాటు పోటీ ప‌డుతూ కాంచ‌న కూడా వ‌సూళ్లు అందుకుంటోంది. ఈమ‌ధ్య కాలంలో ఇంత మాస్ సినిమా రాక‌పోవ‌డం, కాంచ‌న సిరీస్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ బాగా ఆడ‌డం, లారెన్స్‌కు మాస్‌లో మంచి ఇమేజ్ ఉండ‌డం బాగా క‌లిసొచ్చాయి. బీ,సీల‌లో కాంచ‌న థియేట‌ర్లు హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. ఆదివారం కూడా ఇదే జోరు చూపించే అవ‌కాశం ఉంది. గ‌త రెండు నెల‌లుగా టాలీవుడ్ గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్ సినిమాల‌తో… టాలీవుడ్ కాస్త‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com