కంగనకు అవార్డు…! అనుమానపు చూపులు తప్పవు..!

జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌ను జ్యూరీ ప్రకటించింది. ఒకటి కాదు రెండుసినిమాల్లో కంగనా నటన జ్యూరీ సభ్యుల్ని మెప్పించింది. అందులో ఒకటి మణికర్ణిక.. రెండోది పంగా. రెండు సినిమాలు చూసి ఆమెకు కిరీటం పెట్టేశారు. నిజానికి అసలు జాతీయ ఉత్తమనటిగా అందరూ హాట్ ఫేవరేట్‌గా అనుకుంది… దీపికా పదుకొణెని. ఆమె యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ బయోగ్రఫిలో నటించారు. చపాక్ పేరుతో మేఘనా గుల్జార్ తీసిన ఆ సినిమా దేశంలో యాసిడ్ దాడులకు గురైన వారి బాధను.. ఆవేదనను… ప్రపంచం ముందు ఉంచింది. పూర్తి డీ గ్లామర్ క్యారెక్టర్‌లో ఎలాంటి కమర్షియల్ ఫలితాన్ని ఆశించకుడా… దీపికా పదుకొనే స్వయంగా ఆ సినిమాను నిర్మించి నటించారు.

కానీ ఆ సినిమా అవార్డుల జ్యూరీ కమిటీ సభ్యుల్ని మెప్పించలేదు. అంతే కాదు.. అంత కంటే మెరగైన సినిమాలు కూడా వచ్చాయి. గృహహింహ ఆధారంగా తాప్సీ హీరోయిన్ గా వచ్చిన తప్పడ్… కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సెనాతో పాటు మరికొన్ని సినిమాల్లో మహిళా క్యారెక్టర్లు అద్భుతమైనవవి ప్రశంసలు పొందాయి. వారెవరూ… అవార్డుల దరి దాపుల్లోకి రాలేదు. అలా అని కంగనా సినిమాలను తీసి పారేయలేం కానీ.. ఆమెకు ఖచ్చితంగా… ఆయా సినిమాల్లో నటనతో పాటు.. మరో ప్లస్ పాయింట్ కూడా యాడ్ అయి ఉంటుంది.అదే బీజేపీ కోసం స్టేట్ మెంట్లు ఇవ్వడం. సుషాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత నుంచి కంగనా టోటల్‌గా… వివాదాల్లోకి వెళ్లిపోయింది.

బీజేపీని ఎవరు వ్యతిరేకిస్తారో వారిపై విరుచుకుపడటం ప్రారంభించారు. చివరికి రైతు ఉద్యమాన్ని కూడా కించ పరుస్తూ ఆమె మాట్లాడారు. అంతగా సపోర్ట్ చేసే కళాకారిణికి సముచిత రీతిలో గౌరవం ఇవ్వాలని అనుకోకుండా ఉంటారా..?. ఒక వేళ అనుకోకపోయినా… నిజంగానే కంగనా నటనా ప్రతిభకు ఆ అవార్డు ఇచ్చినా… అంగీకరించడానికి అత్యధికులు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే నటకుకు మించి ఆయన రాజకీయం చేశారు కాబట్టి.. రాజకీయ కోణంలోనే చూస్తారు. ఇక్కడ దీపిక, తాప్సీ లాంటి వాళ్లు.. బీజేపీకి.. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి… వారికి సానుభూతి లభిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close