పిచ్చి ముదిరితే రోకలి తలకు చుట్టమన్నాట్ట!

వెనకటికి ఓ ప్రబుద్ధుడు పిచ్చి ముదిరితే.. ‘రోకలి తలకు చుట్టమన్నాట్ట’! మన పల్లెపట్టుల్లో బాగా పాపులారిటీ ఉన్న సామెతల్లో ఇది కూడా ఒకటి. అయితే ప్రస్తుతం కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడు, తన వ్యక్తిత్వంతో ఎంతో వివాదాస్పదుడిగా దేశవ్యాప్త గుర్తింపు కలిగి ఉన్న శశిథరూర్‌ వైఖరి గమనిస్తే.. ఈ సామెత కంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. ఆయనకు మతి చలించి మాట్లాడుతున్నారేమో అని ఎవరైనా వ్యాఖ్యానించినా, అనుమానించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

తాజాగా జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌ను భగత్‌ సింగ్‌, గాంధీ, నెహ్రూ తదితరులంతో కలిపి పోల్చేసి ఆయన కొత్త వివాదాన్ని నెత్తిన పెట్టుకున్నారు. కన్హయ్య- భగత్‌సింగ్‌ ఇద్దరూ ఒకటే తరహా పోరాట యోధులు అంటూ వ్యాఖ్యానించి వివాదాన్ని నెత్తిన పెట్టుకున్నారు. పాకిస్తాన్‌కు జైకొట్టిన ఒక కుర్రాడిని, భారతమాత కోసం ప్రాణాలు ఇచ్చిన భగత్‌సింగ్‌తో పోల్చడం అంటేనే.. ఎంత చవకబారు రాజకీయ గిమ్మిక్కులకు ఆయన తెగబడుతున్నారో ఇట్టే అర్థమైపోతుంది. ఆయన ఎంత దిగజారిన వ్యాఖ్యలు చేశారంటే.. కనీసం ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఈ మాటల్ని సమర్థించలేదు. భాజపా నాయకులంతా మూకుమ్మడిగా వాగ్దాడికి దిగడం సహజం అనుకోవచ్చు. కానీ… కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ కూడా ‘ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం’ అని తప్పించుకోజూస్తే ఏమనుకోవాలి. ఖచ్చితంగా శశిథరూర్‌ మతిచలించి అవతలి వారిని ఇంప్రెస్‌ చేసే ప్రయత్నంలో బుర్రలేకుండా మాట్లాడుతున్నారనే అనుకోవాలి. భగత్‌సింగ్‌ తో కన్హయ్య సమానం అని తాను అనలేదని, వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఒకే తరహావి అని పోల్చానని ఆ తర్వాత థరూర్‌ ఇచ్చిన వివరణలు ఎవ్వరికీ రీచ్‌ కాలేదు.

ఆయన వ్యాఖ్యలు గాడి తప్పుతున్నాయనడానికి కేవలం కన్హయ్య ఉదంతం ఒక్కటే కారణం అనుకుంటే పొరబాటు. స్వలింగ సంపర్కుల హక్కుల గురించి ఆయన కొన్ని రోజుల కిందట మాట్లాడుతూ.. అర్థనారీశ్వరుడు కూడా సగం మగ- సగం ఆడ కదా.. అంటూ పరమశివుడిని హిజ్రాలతో పోలుస్తూ మరో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడు గనుక.. భాజపాకు కోపం తెప్పించే వ్యాఖ్యలు చేయాలని ఆయన అనుకుంటుండవచ్చు. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడడం తన బాధ్యత అని.. అసలే బహుభార్యా ప్రియత్వంలో మునిగి తేలిన ఈ రొమాంటిక్‌ నాయకుడు ఆశపడవచ్చు. కానీ అందుకు మరీ నీచంగా హిందూ విశ్వాసాన్ని కించపరిచేలా దేవుళ్లను కూడా వివాదంలోకి లాక్కురావడం ఎందుకు? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

నాయకులు తమ మాటకు చాలా విలువ ఉంటుందని తెలుసుకోవాలి. మాట బయటకు చెప్పే మందు ఓసారి సమీక్షించుకోవాలి. అలాంటప్పుడు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close