గ‌త పార్ల‌మెంటు స‌మావేశాలు క‌న్నా చూడ్లేదేమో..!

గ‌డ‌చిన పార్ల‌మెంటు సమావేశాల‌ను ఏపీలో ఎవ్వ‌రూ మ‌ర‌చిపోరు..! ఎందుకంటే, రాష్ట్రానికి వ‌చ్చిన హామీలూ విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌పై కేంద్రంలోని భాజ‌పా వైఖ‌రి ఎలా ఉంద‌నేది తేట‌తెల్ల‌మైన స‌మావేశాల‌వి. ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌శ్నించేందుకు ఎంపీలు ప్ర‌య‌త్నిస్తే… ప్ర‌ధానితో స‌హా కేంద్రంలోని అంద‌రూ ముఖం చాటేసిన‌వారే. ఏపీ ప్ర‌యోజ‌నాల అంశ‌మై భాజ‌పా స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడితే… క‌నీసం దానిపై చ‌ర్చించుకోలేక‌పోయారు. ఆర్డ‌ర్ లో లేద‌న్న కుంటిసాకుతో లోక్ స‌భ‌ను వాయిదా వేసిన తీరు ప్ర‌జలంద‌రికీ చాలా బాగా గుర్తుంటుంది. అయితే, ఈ ఘ‌ట‌న ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కి మాత్రం గుర్తున్న‌ట్టు లేదు..!

ఢిల్లీలో విలేక‌రుల‌తో క‌న్నా మాట్లాడారు. త‌న‌పై ఏపీలో జ‌రిగిన దాడి విష‌య‌మై కేంద్ర హోం శాఖ‌కు వివ‌రించాన‌నీ, ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిస్తార‌ని మాటిచ్చార‌ని చెప్పారు. ఏపీలో దుర్మార్గ‌మైన పాల‌న సాగుతోంద‌న‌డానికి నిద‌ర్శ‌నం త‌న‌పై జ‌రిగిన దాడే అన్నారు! ఇక‌, రాబోయే పార్ల‌మెంటు స‌మావేశాల్లో కూడా కేంద్రాన్ని నిల‌దీసేందుకు ఇప్ప‌టికే ఏపీ అధికార పక్షం మ‌రోసారి ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై క‌న్నా స్పందిస్తూ… పార్ల‌మెంట‌రీ రూల్స్ ప్ర‌కారం అవిశ్వాస తీర్మానం పెట్టే హ‌క్కు అన్ని పార్టీల‌కూ ఉంటుంద‌న్నారు. అయితే, చ‌ర్చ జ‌రిగే వాతావ‌ర‌ణం ఉండాల‌న్నారు! నోటీసులు ఇచ్చేసి, చ‌ర్చ జ‌ర‌గ‌నీయ‌కుండా వీళ్లే చేస్తుంటార‌న్నారు! ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం త‌రువాత చ‌ర్చ చేప‌డ‌దామ‌ని స్పీక‌ర్ చెబితే… దాన్ని ఆపేసి చ‌ర్చ జ‌ర‌గాలంటూ ప‌ట్టుబ‌డ‌తార‌న్నారు. అంటే, చ‌ర్చ జ‌ర‌గ‌కుండా చేయ‌డ‌మే వారి ల‌క్ష్య‌మ‌నీ, జ‌రిగితే వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు తెలిసిపోతాయ‌న్న భ‌యం వారికి ఉంద‌ని ఆరోపించారు. మ‌రోసారి అవిశ్వాసం అని అంటుండం కేవ‌లం డ్రామా కోస‌మేన‌ని క‌న్నా అన్నారు.

విచిత్రం ఏంటంటే… గత పార్ల‌మెంటు స‌మావేశాల్లో అవిశ్వాసాన్ని ఎదుర్కొన‌లేక‌పోయింది భాజ‌పా! అయినా, ఇక్క‌డ క‌న్నా మ‌ర‌చిపోతున్న, లేదా కంఫ‌ర్ట‌బుల్ గా డైవ‌ర్ట్ చేస్తున్న విష‌యం ఏంటంటే… స‌భ‌ను స‌జావుగా న‌డ‌పాల్సిన బాధ్య‌త అధికార పార్టీకే ఉంటుంది. లోక్ స‌భ‌లో అయితే ప్ర‌ధాన‌మంత్రే బాధ్యులు అవుతారు. స‌భ‌లో గంద‌ర‌గోళ ప‌రిస్థితికి కార‌ణ‌మైన నాయ‌కులు లేదా పార్టీల‌తో లోక్ స‌భ స్పీక‌ర్ వ్య‌క్తిగ‌తంగా చ‌ర్చించాలి. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవాలి. కానీ, గ‌త స‌మావేశాల్లో స్పీక‌ర్ పోడియం ముందుకు దూసుకొస్తున్న త‌మిళ‌నాడు ఎంపీల‌ను నిలువ‌రించే ప్ర‌య‌త్నం స్పీక‌ర్ ఎందుకు స‌క్సెస్ ఫుల్ గా చెయ్య‌లేక‌పోయారు..? స‌భ ప్రారంభం కావ‌డం.. కాసేపు వాయిదా, ఆ త‌రువాత మ‌ర్నాటికి వాయిదా..! ఇదే క‌దా గత స‌మావేశాల్లో జ‌రిగింది. ఏపీ సమస్యలపై చ‌ర్చ‌కు భాజ‌పా సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన దాఖ‌లాలు లేవు. మ‌రి, ఈ క్ర‌మ‌మంతా ఏపీలో ప్ర‌జ‌ల‌కు బాగానే గుర్తుంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close