ప్రత్యేకహోదా ఇస్తామని మోదీ చెప్పలేదట..! కన్నా కూడా అదే చెబుతున్నారు..!!

నిన్నటి వరకూ.. ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలన్నింటినీ కేంద్రం అమలు చేస్తుందని.. తెలుగుదేశం పార్టీ డ్రామాలు ఆడుతోందని చెప్పిన కన్నా లక్ష్మినారాయణ.. మెల్లగా టోన్ మారుస్తున్నారు. ప్రత్యేకహోదా హామీని అసలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవ్వనే లేదని విజయనగరంలో ప్రకటించేశారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకహోదా హామీ ఇచ్చారని..దాన్ని అమలు చేయడం లేదని టీడీపీ నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఆ వీడియోలను.. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రదర్శిస్తున్నారు. ధర్మ పోరాట సభల్లో ఆ వీడియోలే హైలెట్. అయినా సరే బీజేపీ నేతలు… ప్రధానమంత్రి ఆ హామీ ఇవ్వలేదని చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.

కొద్ది రోజుల కిందట.. తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి.. కూడా ..ఈ విషయంలో విచిత్రమైన వాదన వినిపించారు. మోదీకి.. తిరుపతిలో వేదికపై ఎవరో చీటి రాసిస్తే చదివారని..ఆయనకు ప్రత్యేకహోదాపై అవగాహన లేదని ప్రకటిచేశారు. ఇది బీజేపీని మరింత నవ్వుల పాలు చేసింది. ఆ తర్వాత ఏపీ బీజేపీ నేతలు.. మరో వాదన తీసుకొచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. చంద్రబాబు నాయుడు ప్రదర్శిస్తున్న వీడియోలు.. మార్ఫింగ్ అని తేల్చేశారు. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఆ తర్వాత బీజేపీ నేతలు సైలెంటయిపోయారు. మళ్లీ ఇప్పుడు.. కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్షుడయిన కన్నా లక్ష్మినారాయణ అసలు ప్రధానమంత్రి ప్రత్యేకహోదా హామీ ఇవ్వనేలేదనే వాదనను మరోసారి తెరపైకి తెచ్చారు. మోదీ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని… కన్నా తేల్చేశారు. అది వక్రీకరణే అయితే.. ఇంత రచ్చ ఎందుకు..? నాలుగేళ్ల కిందటే… మోదీ ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పలేదని చెప్పి ఉండొచ్చు కదా..?

ఇక విభజన చట్టంలో ఉన్న ఇతర హామీలపైనా… కన్నాలక్ష్మినారాయణ స్పందన అలాగే ఉంది. చట్టంలో వివిధ ప్రాజెక్టుల ఏర్పాటు విషయం కేవలం పరిశీలించాలని మాత్రమే ఉందనన్నారు. విశాఖ రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ అన్నీ పరిశీలించాలనే ఉందని కొత్తగా నొక్కి చెబుతున్నారు. చట్టంలో పరిశీలించాలని ఉండటం అంటే.. పరిశీలించి… అడ్డంకులు ఏమైనా ఉంటే అధిగమించి… ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయాలనే అర్థమని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి వరకూ… ఎట్టి పరిస్థితుల్లోనూ హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కన్నా.. ఇప్పుడు మెల్లగా… హామీలు అమలు చేసేశాం.. చట్టంలో ఉన్నట్లుగా పరిశీలించేశాం…అని చెప్పే దిశగా సాగుతున్నారు. హామీలు నెరవేర్చలేనప్పుడు.. అసలు అలాంటి హామీ ఇవ్వలేదని చెప్పడం రాజకీయాల్లో రివాజు. ఇప్పుడు బీజేపీ అదే చేస్తోంది. దాని కోసం మోడీ ఇచ్చిన హామీనే వక్రీకరించుకుని దాన్ని ప్రజలపై నెట్టేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close