సుశాంత్ ఆత్మహత్యకు వాళ్లనే బాధ్యులను చేయాలా..!?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలేమిటో చనిపోయిన సుషాంత్‌కే స్పష్టంగా తెలుసు. ఆయన ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. దాంతో ఆయన ఆత్మహత్యకు బాధ్యులను చేయడానికి బాలీవుడ్ పెద్దలే అందరికీ దొరికారు. బాలీవుడ్‌ బడా నిర్మాతలుగా ఉన్న కరణ్ జోహార్ దగ్గర్నుంచి నమ్మిన వాళ్లకు అవకాశాలు కల్పించేందుకు… వెనుకాడరని ప్రచారంలో ఉన్న సల్మాన్ ఖాన్ వరకూ అందర్నీ బాధ్యుల్ని చేయడం ప్రారంభించారు. బాలీవుడ్ ప్రవిలేజ్ క్లబ్ అంటూ.. ఓ పేరు పెట్టి అందరూ సుషాంత్ ఆత్మహత్యలో బాధ్యులంటూ.. సోషల్ మీడియాలో నిందించడం ప్రారంభించారు.

కరణ్ జోహార్ బాలీవుడ్ పెద్దల వారసుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో కీలకంగా ఉంటారు. ఓ రకంగా అందరూ ఆయననే ఆశ్రయిస్తారు. ప్రస్తుతం స్టార్లుగా మారుతున్న యువ నటులు.. అలియా భట్. సిద్ధార్థ మల్హోత్రా, వరుణ్ ధావన్ సహా పలువుర్ని కరణ్ జోహార్ పరిచయం చేశారు. కానీ ఆయనే వాళ్లని నిలబెట్టలేదు. వారికి సక్సెస్‌లు వస్తే నిలబడ్డారు. కనుమరుగు అయిన వారసులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు . ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. సినిమా ఒక్క నటీనటులతోనే నడవదు. ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఉంటాయి. అందులో పని చేయడానికి వారసులు దొరకరు. ఓ డైరక్టర్ కొడుకు డైరక్టర్ అయిపోలేడు. ఈ తరహాలో ఆలోచిస్తే.. కరణ్ జోహార్.. కొన్ని వందల మంది కొత్త వారికి… టెక్నిషియన్లుగా ఇండస్ట్రీలో చోటు కల్పించారు. ఈ సబ్జెక్ట్ చర్చించుకుంటే చాలా పెద్దదవుతుంది.

ఒక్క కరణ్ జోహార్ మీద మాత్రమే కాదు.. యష్ రాజ్ ఫిల్మ్స్, ఏక్తాకపూర్ బాలాజీ ఫిల్మ్స్ తో పాటు సల్మాన్ ఖాన్ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ సంస్థలన్నీ ఎప్పుడూ… మూడు, నాలుగు సినిమాలతో పాటు.. వెబ్ సిరీస్‌లు.. ఇతర కంటెంట్ నిర్మాణంలో బిజీగా ఉంటాయి. అక్కడ చాన్సులు ఆశించి దొరకని వారు ఉంటారు.. ముందు ఒప్పందం చేసుకుని.. తర్వాత వద్దనుకున్న వారు కూడా ఉంటారు. అలాంటి బడా సంస్థల్లో అలాంటివి సహజంగా ఉంటాయి. వారికి ఎవరైనా మనీ స్పిన్నింగ్ చేయగలుగుతారో.. వారిని ఆయా సంస్థలు ఎంటర్ టెయిన్ చేస్తాయి. డబ్బులు పోయినా సరే.. వారసుల్ని నిలబెట్టాలని ఎవరూ అనుకోరు. అలా అనుకుంటే… సుషాంత్ సింగ్‌కు తొలి చాన్స్ వచ్చేదే కాదు. ఆయనను పరిచయం చేసింది.. బాలాజీ టెలీ ఫిల్మ్స్ ఏక్తా కపూరే. ఇప్పుడు ఆయన ఆత్మహత్యకు కారణం అంటున్న వారిలో ఆమె పేరు కూడా ఉంది. సల్మాన్ ఖాన్.. పై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో చాలా మందికి తెలియదు. కానీ సల్మాన్ మాత్రం.. ఓ సర్కిల్ ను ఏర్పాటు చేసుకుని వారిని ప్రోత్సహించడానికి ప్రయారిటీ ఇస్తారన్నది బాలీవుడ్‌లో బహిరంగ రహస్యమే. తన సర్కిల్‌లో చేర్చుకోనంత మాత్రాన.. ఆయన సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటారని అనుకోలేం.

సుషాంత్ ఆత్మహత్య చేసుకునేనాటికి ఆయనకు సినిమా చాన్సులు లేవని ఎవరూ చెప్పరు. బాలీవుడ్ చాలా పెద్దది. సక్సెస్ వస్తే.. అందరూ వెంట పడుతారు. అంతగా వారసుల్నే ప్రోత్సహించాలనుకుంటే.. లెజెండ్ అమితాబ్ బచ్చన్ కొడుకు.. ఎందుకు అలా ఉండిపోయాడో… విమర్శకులు అంచనా వేసుకోవచ్చు. అంతిమంగా.. చాలా మంది బాలీవుడ్ పెద్దలపై తమ కసి తీర్చుకోవడానికి పాత పగల్ని చల్లార్చుకోవడానికి సుషాంత్ ఆత్మహత్యను వాడుకుంటున్నారు..తప్ప.. అంతకు మించి మరేమీ లేదు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close