గవర్నర్ ఆదేశాలను ధిక్కరించిన కర్ణాటక స్పీకర్..!

కర్ణాటకంలో కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నరలోపు… బలపరీక్ష నిర్వహించి తీరాల్సిందేననన్న గవర్నర్ వజూభాయ్ వాలా ఆదేశాలను స్పీకర్ రమేష్‌కుమార్ పట్టించుకోలేదు. అవిశ్వాస తీర్మానం చర్చ పూర్తవకుండా.. చర్చ ఎలా నిర్వహిస్తామని.. ఆయన వ్యాఖ్యానించారు. చర్చ కొనసాగించారు. స్పీకర్ ను ఆదేశించే అధికారాలు గవర్నర్‌కు లేనని.. సభలో.. అధికారపక్షం ప్రకటించింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అయినప్పటికీ.. స్పీకర్ బలపరీక్ష విషయంలో తొందరపడలేదు. గవర్నర్ పెట్టిన డెడ్ లైన్ సమయం.. మ.ఒకటిన్నర వరకూ సభను నడిపిన స్పీకర్..ఆ తర్వాత లంచ్ బ్రే్క్ ఇచ్చారు.

తనను సుప్రీం కోర్టు, గవర్నర్ శాసించలేరని స్పీకర్ స్పష్టం చేశారు. గవర్నర్ లేఖ పంపింది సీఎం కుమారస్వామికి అని, అందువల్ల నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఆయనేనని స్పీకర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారనే అంశంపై చర్చ జరగాలని సీఎం కుమారస్వామి పట్టుబట్టారు. ప్రభుత్వం నిలబడటం కష్టమని.. తేలడంతో… కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి.. ప్లాన్ బీని అమలు చేస్తున్నాయని చెబుతున్నారు. తమంతట తాముగా.. సర్కార్ పడిపోకుండా చూసుకుంటే.. రాజ్యాంగం పేరుతో.. కేంద్రమే.. గవర్నర్ ద్వారా నివేదిక తెప్పించుకుని… రాష్ట్రపతి పాలన విధించడమో.. ప్రభుత్వాన్ని రద్దు చేయడమో చేస్తుందని… దాని వల్ల బీజేపీ… ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో… సుప్రీంకోర్టులోనూ… రెబల్ ఎమ్మెల్యేల విషయంపై పిటిషన్ వేయాలనే ఆలోచన కాంగ్రెస్ చేస్తోంది. దీంతో మరికొంత సమయం… కర్ణాటక సర్కార్ కు లభిస్తుంది. మొత్తంగా.. బలపరీక్ష చేయించి.. మెజార్టీ లేదని.. తేల్చి.. ఆ తర్వాత తమ సర్కార్ ను ఏర్పాటు చేయాలనుకున్న బీజే్పీకి.. పరిస్థితులు.. అంత తేలిగ్గా ఏమీ కలసి రావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com