ఛలో… ఈ చర్య ఊహాతీతం సుమీ!

స్వర్గీయ నందమూరి తారకరామారావుపై అభిమానంతో కొంతమంది తమ పిల్లలకు ఆయన పేరు పెట్టుకున్నారు. మరి కొంతమంది అక్కినేని నాగేశ్వరరావుపై పేరు పెట్టుకున్నారు. తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పేర్లు పెట్టుకున్నారు. ఈతరంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకు అంతటి స్టార్‌డ‌మ్ ఉంది. వీరిపై అభిమానంతో తమ పిల్లలకు పవన్, మహేష్ అని పేర్లు పెట్టుకున్నారంటే నమ్మవచ్చు. కానీ, ఇప్పుడిప్పుడే కెరీర్‌లో పైకి వస్తున్న నాగశౌర్య పేరు తమ పిల్లాడికి పెట్టుకుంటారని ఎవరైనా ఊహించగలరా? కానీ, అమెరికాలో ఒకరు పెట్టుకున్నారు. ఆదివారం జరిగిన ‘ఛలో’ థాంక్స్ మీట్‌లో లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ ఈ విషయాన్ని చెప్పారు.

కాసర్ల శ్యామ్‌ మాట్లాడుతూ “నాకు ఫేస్ బుక్‌లో వందన అని ఒక ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళ క‌జిన్‌ నాగశౌర్యగారికి విపరీతమైన ఫ్యాన్. ఆ క‌జిన్‌కి ‘ఛలో’ విడుదల రోజున ఒక అబ్బాయి పుట్టాడు. అందుకని ఆ అబ్బాయికి శౌర్య అని పేరు పెట్టుకున్నారు. ఈ సంగతిని మా హీరోకి చెప్పమని నాతో చెప్పారు” అన్నారు. థాంక్స్ మీట్ వేదిక ముందున్న జనాలకు కాసర్ల శ్యామ్ మాటలు చిన్నపాటి స్వీట్ షాక్ ఇచ్చాయి. నాగశౌర్య, అతని ఫ్యామిలీకి మాత్రం చాలా అంటే చాలా ఆనందాన్ని కలిగించి ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజంగా ఈ చర్య ఊహాతీతం సుమీ!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.