క‌త్తి మ‌హేష్‌… అవుటాఫ్ డేంజ‌ర్‌!

రోడ్డు ప్ర‌మాదంలో క‌త్తి మ‌హేష్ తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. క‌త్తిమ‌హేష్ కి అయిన గాయాల తీవ్ర‌త దృష్ట్యా ఆయ‌న‌కు బ్రెయిన్ స‌ర్జ‌రీ చేయాల‌ని అనుకున్నారు. అయితే… బ్రెయిన్ ఇంజ్యూరీ పెద్ద‌దేం కాద‌ని డాక్ట‌ర్లు నిర్దారించారు. ఆప‌రేష‌న్ చేసే అవ‌కాశాలు స్వ‌ల్పంగానే ఉన్నాయ‌ని స‌మాచారం. నిన్న‌టి వ‌ర‌కూ.. క‌త్తి మ‌హేష్ ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు. కానీ.. ఇప్పుడు ఆయ‌న ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏమీ లేద‌ని డాక్ట‌ర్లు భ‌రోసా కూడా ఇచ్చార‌ని సమాచారం. కంటి భాగంలో ఆయ‌న‌కు బాగా దెబ్బ త‌గిలిన దృష్ట్యా కంటి ఆప‌రేష‌న్ అవ‌స‌రం కానుంది. అంకోసం ఆయ‌న్ని చెన్నై త‌ర‌లించే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. క‌త్తిమ‌హేష్ ఆరోగ్య స్థితి తెలుసుకుని, చాలామంది స‌న్నిహితులు, రాజకీయ నేత‌లు, సినీ సెల‌బ్రెటీలూ సాయం చేయ‌డానికి ముందుకొస్తున్నారు. అయితే క‌త్తిమ‌హేష్ కి ఆర్థిక ఇబ్బందులేం లేవ‌ని, అవ‌స‌ర‌మైతే దాత‌ల స‌హాయం తీసుకుంటామ‌ని స‌న్నిహితులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close