ఈడీపై ఎదురుదాడి చేసి కవిత సాధించేదేముంది ?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవిత తరపున వ్యవహారాలు, వ్యూహాలు అమలు చేస్తున్న వారి ఆలోచన కవితను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దర్యాప్తు సంస్థపై వరుసగా మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఈడీ మీడియాకు లీకులు ఇచ్చి ప్రత్యర్థులు విమర్శించేలా చేస్తోందని ఆమె అంటున్నారు. అలా అనడమే కాదు.. ఆమె క్యాంప్ అధికారికంగా అసలు ఈడీ విచారణలో ఏమి జరిగిందో ఓ లీక్ విడుదల చేశారు.

ఇందులో విచిత్రమైన అంశాలున్నాయి. అసలు కవితను ఈడీ విచారణ జరపలేదని.. కవితే ఈడీ అధికారులను ప్రశ్నించిందన్నట్లుగా ఆ అఫీషియల్ లీక్ ఉంది. ‘నన్ను ఏ ప్రాతిపదికన విచారణకు పిలిచారు? నేను నిందితురాలినా? ఢిల్లీ ప్రభుత్వం క్యాబినెట్‌ ఆమోదంతో అధికారికంగా మద్యం విధానాన్ని మార్చుకుంటే దాంతో నాకేంటి సంబంధం? ఇలా రాజకీయ కోణంలో మీరు ఎంతమందిని విచారణకు పిలుస్తారు? గతంలో విపక్షంలో ఉన్న హిమంత బిశ్వశర్మ, నారాయణ్‌ రాణె, సుజనా చౌదరిలపై ఈడీ పెట్టిన కేసులు ఏమయ్యాయి? వారు బీజేపీలో చేరగానే విచారణ ఎందుకు ఆగిపోయింది? విచారణ పేరుతో పిలిచి గంటల తరబడి ఒంటరిగా గదిలో కూర్చోబెట్టి మానసికంగా ఒత్తిడి చేస్తే లొంగిపోతామనుకుంటున్నారా? అసలు రాజకీయనాయకులపై మీరు పెడుతున్న కేసులెన్ని? వాటిలో ఎన్నింటిని రుజువు చేయగలిగారు?’.. ఇలా కవిత ప్రశ్నల పరంపర సంధిస్తే ఈడీ అధికార్లనుంచి నీళ్లు నమిలారని చెప్పుకున్నారు. కానీ ఈడీ అంత అవకాశం ఇస్తుందని ఎవరూ అనుకోవడం లేదు.

ఈడీని ఇలా కవిత కడిగి పారేశారని ఓ వైపు ప్రచారం చేస్తూ.. మరో వైపు కవిత పేరుతో ఓ లేఖ విడుదల చేశారు.అందులో రాజకీయ పరమైన ఆరోపణలు ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ నేతలు .. దర్యాప్తు సంస్థపై ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. అసలు దర్యాప్తు సంస్థను ఇలా టార్గెట్ చేయడం ఏ మాత్రం మంచిది కాదని.. ఇలాంటి అంశాలపై అవగాహన ఉన్న వారు చెబుతారు. కానీ కవిత విషయంలో ఈ రిస్క్ తీసుకుంటున్నారు. ఎందుకిలా చేస్తున్నారన్నది మాత్రం వారికే తెలియాలి.కానీ అంతిమంగా ఇలా చేయడం వల్ల జరగాల్సిన నష్టం కన్నా ఎక్కువే జరుగుతుందన్న ఆందోళన మాత్రం బీఆర్ఎస్ క్యాడర్‌లో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close