ప్లాన్ చేంజ్ .. ఎఫ్ఐఆర్ కాపీలివ్వాలని సీబీఐకి కవిత లేఖ !

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కల్వకుంట్ల కవిత వ్యూహం మార్చినట్లుగా కనిపిస్తోంది. సీబీఐ నుంచి నోటీసు అందగానే… హైదరాబాద్‌లోని తమ ఇంట్లో విచారణకు సిద్ధమని ఆమె ప్రకటించారు. అయితే ఇప్పుడు ఫిర్యాదు తో పాటు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని లేఖ రాశారు. తనకు నోటీసు ఇచ్చిన సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి శనివారం లేఖ రాశారు. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు.

సీబీఐ నుంచి తనకు నోటీసు అందిందని స్వయంగా కవితనే ప్రకటించారు. శనివారం ఉదయం ప్రగతి భవన్‌కు వెళ్లి తన తండ్రి , సీఎం కేసీఆర్‌తో తనకు వచ్చిన నోటీసులపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయనిపుణులతోనూ కేసీఆర్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలోనే ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ డీటైల్స్ కాపీలు తీసుకోవాలని లేఖ రాయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు కవిత లేఖ రాశారు .. సమాచారాన్ని మీడియాకు ఇచ్చారు.

అయితే సీబీఐ ఇలా వివరణ కోసం వచ్చినప్పుడు… ఫిర్యాదు కాపీలు, ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకు వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు అవి ఇవ్వకపోతే.. విచారణకు హాజరయ్యేందుకు.. తన తరపున క్లారిఫికేషన్ ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉంది. ఆ వ్యూహంతోనే ఎఫ్ఐఆర్ కాపీలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఆ వ్యూహమే అమలు చేస్తో ఆరో తేదీన కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘జై హ‌నుమాన్‌’లో తేజా స‌జ్జా లేడా?

'హ‌నుమాన్తో' తేజా స‌జ్జా ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సీక్వెల్‌గా 'జై హ‌నుమాన్' రూపుదిద్దుకొంటోంది. ఇందులో తేజా స‌జ్జా ఉంటాడా, ఉండ‌డా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమాలో...

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close