రెండో ద‌ఫా ప్ర‌చారంలో కూడా కేసీఆర్ ప్ర‌ధానాస్త్రం ఇదేనా..?

అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే తెలంగాణ వ్యాప్తంగా పార్టీల ప్ర‌చారం మంచి జోరుమీదుంది. టిక్కెట్ల కేటాయింపుల ప్ర‌క్రియ‌లు ముగింపు ద‌శ‌కు వ‌చ్చేయ‌డంతో, మూడో లిస్టు విడుద‌ల చేసేసి మ‌హా కూట‌మి ప్ర‌చారంపైనే దృష్టి కేంద్రీక‌రించాల‌ని కాంగ్రెస్ సిద్ధ‌మౌతోంది. అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతోపాటు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కూడా ప్ర‌చారానికి రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెరాస అధినేత కేసీఆర్ కూడా ప్ర‌చారానికి సిద్ధ‌మ‌య్యారు. తెరాస‌లో కూడా మిగిలిన సీట్ల కేటాయింపులు పూర్తి కావడంతో ఆయ‌న రంగంలోకి దిగుతున్నారు.

ఇప్ప‌టికే తొలి విడ‌త ఆయ‌న కొన్ని స‌భ‌లు నిర్వ‌హించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్పుడు మ‌లి విడ‌త‌ల ప్ర‌చార షెడ్యూల్ ఖ‌రారు అయింది. ఈ నెల 19 నుంచి 25 వ‌ర‌కూ రాష్ట్రంలో నిర్వ‌హించ‌బోతున్న బ‌హిరంగ స‌భ‌ల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. 19న ఖ‌మ్మం, పాల‌కుర్తిలో. 20న సిద్ధిపేట‌, హుజూరాబాద్‌, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలో. 21న జ‌డ్చ‌ర్ల‌, దేవ‌ర‌కొండ‌, న‌కిరేక‌ల్‌, భువ‌న‌గిరి, మెద‌క్ లో స‌భ‌లుంటాయి. 22న ఖానాపూర్‌, ఇచ్చోడ‌, నిర్మ‌ల్‌, ముధోల్, ఆర్మూర్. 23న న‌ర్సంపేట, మ‌హ‌బుబాబాద్, జ‌న‌గామ‌, డోర్న‌క‌ల్‌, తుంగ‌తుర్తి, సూర్య‌పేట‌, జ‌న‌గామ‌. 25న తాండూరు, నారాయ‌ణ పేట‌, ప‌రిగి, షాద్ న‌గ‌ర్‌, ఇబ్ర‌హింప‌ట్నం, దేవ‌ర‌క‌ద్ర‌ల్లో కేసీఆర్ పాల్గొన‌బోతున్నారు. కేసీఆర్ షెడ్యూల్ ఖ‌రారు కావ‌డంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి.

మ‌లి విడ‌త ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధానంగా టీడీపీ, కాంగ్రెస్ ల మైత్రి మీద‌నే మ‌రోసారి కేసీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌సంగించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే, ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లైన ద‌గ్గర్నుంచీ గ‌మ‌నిస్తే… నాలుగేళ్ల పాల‌నలో వారు సాధించిన విజ‌యాల‌ను ప్ర‌ముఖంగా ప్ర‌చారం చేసుకునే కంటే, మ‌హా కూట‌మి మీద విమ‌ర్శ‌లు చేయ‌డం ద్వారా ఒక సెంటిమెంట్ ను మ‌రోసారి తెలంగాణ ప్ర‌జ‌ల్లో ర‌గిలించే ప్ర‌య‌త్న‌మే చేస్తున్నారు. ‘తెలంగాణ వ్య‌తిరేకులు’ అనే భావ‌జాలం తీసుకొచ్చి, ఇత‌ర ప‌క్షాల‌ను అదే దృష్టితో వేలెత్తి చూపించి ల‌బ్ధి పొందే ప్ర‌య‌త్న‌మే ఇంత‌వ‌ర‌కూ తెరాస చేసిన ఎన్నిక‌ల ప్ర‌చారంగా చెప్పుకోవ‌చ్చు. ఇప్పుడు మలి విడ‌త కూడా కేసీఆర్ అదే అంశాన్ని మ‌రింత తీవ్రంగా ప్ర‌స్థావించే అవ‌కాశం ఉంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. మ‌రి, ఈ వ‌రుస స‌భ‌ల్లో కేసీఆర్ ప్ర‌చారంలో కొత్త పంథా ఏదైనా ఉంటుందేమో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close