కేసీఆర్ ఎటాక్- చంద్రబాబు మొహమాటం – జగన్ మౌనం !

కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాల పార్టీల స్పందనతో ఆ పార్టీ విధానం తెలిసిపోతోంది. కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ తీవ్రంగా విరుచుపడ్డారు. మొదట పనికి మాలిన, పసలేని, గోల్ మాల్ బడ్జెట్ అంటూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. తర్వాత ఆ డోస్ సరిపోలేదని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టారు. తనదైన శైలిలో గంటన్నర సేపు బడ్జెట్‌ను చీల్చిచెండాడారు. ప్రభుత్వంపైన.. మోడీ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. బడ్జెట్‌కు సంబంధం లేని అంశాలను తెచ్చి మోడీపై విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటయిన ఆర్బిట్రేషన్ సెంటర్‌ను మోడీ గుజరాత్ తరలించుకుపోవాలనుకున్నారని ఆరోపించారు. అన్ని రకాలుగా విమర్శించి.. బడ్జెట్‌లో గోల్ మాల్ తప్ప ఏమీ లేదని..దేశాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ బీజేపీపై యుద్ధమే అన్న ఫార్ములా ఫాలో అవుతున్నారు కాబట్టి కేసీఆర్ ఘాటు స్పందనను చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేశారు.

ఏపీ సీఎం జగన్ బడ్జెట్‌పై స్పందించలేదు. ఆయనకు అలాంటి అలవాటు లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు స్పందించకుండా ఉండే అలవాటు లేదు. ఈ ప్రకారం ఆయన స్పందించారు. అయితే కేసీఆర్ స్టైల్లో కాకుండా విమర్శించడానికి మొహమాట పడ్డారు. బడ్జెట్ ఆశాజనకంగా లేదని రైతులు, పేదలు.. కొవిడ్తో దెబ్బతిన్న రంగాలకు ఎలాంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్లో చెప్పలేదన్నారు. ఆహార సబ్సిడీని తగ్గించి పేదలపై భారం మోపుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో వైఎస్ఆర్‌సీపీ విఫలమయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 28 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని.. . ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో.. సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వీలైనంత పొలైట్‌గా బడ్జెట్‌ను ఖండించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.

సీఎం జగన్ స్పందించలేదు కానీ… ఢిల్లీలో విజయసాయిరెడ్డి మాత్రం స్పందించారు. ఈ బడ్జెట్ చాలా నిరుత్సాహ పరిచిందని ఎప్పట్లాగే చెప్పిన ఆయన .. అప్పుల విషయంలో మాత్రం కేంద్రంపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పులు తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని కేంద్రం నిబంధన పెట్టిందని కాంగ్రెస్ కేంద్రం మాత్రం అదే పనిగా అప్పులు చేస్తోందని.. ఎఫ్ఆర్‌బీఏం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని అన్నారు. ఇది ద్వంద్వ ప్రమాణాలను పాటించడమేనని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కూడా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి మించి రుణాలు తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close