తెలుగు ఐడెంటిటీనే లేదన్న కెసిఆర్‌

నిజమే.నిన్న మొన్న ప్రపంచ తెలుగు మహాసభలు అంత ఘనంగా నిర్వహించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇలా అంటారా అంటే అన్నారు మరి. ఇండియా టుడే దక్షిణాది కాంక్లేవ్‌లో రాజ్‌దీప్‌ సర్దేశాయి ప్రశ్నకు జవాబుగా ఆయన అన్న మాటలివి.తెలంగాణ ఆంధ్ర పూర్తిగా భిన్నమైనవనీ, మాట్లాడే భాష, ఆచారాలు పండుగలు అన్నీవేర్వేరని చెప్పారు. మాట్లాడే భాష అన్నదాన్ని తర్వాత యాసగా సర్దుకున్నారు. ఎన్టీఆర్‌ పార్టీలోనుంచి వచ్చిన మీరు అలా అంటున్నారా అంటే మరోసారి ఔనని సమాధానమిచ్చారు. ఈ కాంక్లేవ్‌లో రాజ్‌దీప్‌ అడిగిన ప్రశ్నలు ఏమంత బాగాలేకపోవడంతో కెసిఆర్‌ అవలీలగా జవాబులు చెప్పేశారు. జూన్‌2న రాష్ట్రావతరణ తర్వాత ఇది నిలబడుతుందా లేదా అని మీరెప్పుడైనా నెర్వస్‌ అయ్యారా అని రాజ్‌దీప్‌ అడిగిన ప్రశ్నకు వచ్చే జవాబు ముందే వూహించదగింది. అసలు ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటే తప్పని కెసిఆర్‌ జవాబు. అంతటితో ఆగక ఆనాడు తెలంగాణలో ప్రజలు పార్టీలూ అందరూ వ్యతిరేకించినా దాన్ని ఏర్పాటు చేశారని కెసిఆర్‌ చెప్పింది మాత్రం ఒక చారిత్రిక అవాస్తవం. తెలంగాణ దేశంలో నెంబర్‌ 1గా వున్నప్పుడు వాస్తు బాగాలేదని సచివాలయం మార్చడం ఎందుకుని రాజ్‌దీప్‌ ఒక మంచి ప్రశ్న వేస్తే ఇప్పుడున్నది ఏమాత్రం బాగాలేదని బదులిచ్చారు. ప్రగతిభవన్‌ తన ఇల్లు కాదని అధికార నివాసమని మరో మాట చెప్పారు. కుటుంబ సభ్యులందరికీ పదవులు ఇవ్వడంతో మిగిలిన ప్రాంతీయ పార్టీలలాగే టిఆర్‌ఎస్‌ కూడా కుటుంబ పాలనగా మారిందని అడిగితే చాలా తెలివిగా నా కుటుంబమే తెలంగాణ అన్నారు. తర్వాత తెలంగాణే నా కుటుంబం అని జోడించారు. జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు.మొత్తంపైన ఈ ప్రశ్నల తతంగం రొటీన్‌గానే చెప్పాల్సి వుంటుంది. కెసిఆర్‌ కేంద్ర మంత్రిగా వున్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఆత్మ విశ్వాసంతో కనిపిస్తున్నారని అంటే విజయాలు ప్రజల మద్దతు వున్నప్పుడు అంతేనని ఆయన బదులిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close