డెడ్‌లైన్ ముగిసింది..! ఇక ఆర్టీసీ లేనట్లేనా…?

ఆర్టీసీ సమ్మెపై ఇప్పుడు అందరిలోనూ ఇదే ఉత్కంఠ. సమ్మె ప్రారంభమైన రెండో రోజే… అందరి ఉద్యోగాలు పోయాయని.. సీఎం కేసీఆర్ ప్రకటించేశారు. ఆ తర్వాత మూడు సార్లు..కార్మికులకు విధుల్లో చేరాలనే ఆఫర్ ఇచ్చారు. మూడో సారి ఇచ్చిన ఆఫర్ కూడా ముగిసిపోయింది. చేరితే ఉద్యోగాలుంటాయ్.. లేకపోతే.. ఆర్టీసీనే ఉండదని.. కేసీఆర్ నిర్మోహమాటంగా చెప్పేశారు. అయినప్పటికీ.. యాభై వేల మంది ఆర్టీసీ కార్మికుల్లో పట్టుమని ఐదు వందల మంది కూడా.. విధుల్లో చేరలేదు. కార్మికులు డెడ్ లైన్ ముగిసేలోపు చేరలేదు కాబట్టి.. ఇక కేసీఆర్ చెప్పినట్లు చేస్తే..ఆర్టీసీ లేనట్లే. ఆర్టీసీకి సంబంధించి సగానికి సగం రూట్లను ప్రైవేటీకరిస్తూ ఇప్పటికే తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కార్మికులు సమ్మెలో చేరకపోవడం వల్ల మిగిలిన సగం కూడా.. ప్రైవేటు పరం అవుతాయి.

ఆర్టీసీ విషయంలో కేసీఆర్‌వన్నీ బెదిరింపులేనని.. కార్మికులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే రెండు నెలల నుంచి జీతాలు రాకపోయినా.. కేసీఆర్.. నిర్ణయాల్లో తీవ్రతను అంతకంతకూ పెంచుకుంటూ పోయినా… వారు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆర్టీసీ విషయంలో… కేసీఆర్ ఏకపక్షంగాఎలాంటి నిర్ణయం తీసుకోలేరని… కార్మికులు గట్టిగా నమ్ముతున్నారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆర్టీసీలో కేంద్రానికి 31శాతం వాటా ఉంటుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి అని.. ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు. కార్పొరేషన్‌ను మార్చాలంటే కేంద్రం అనుమతి లేకుండా ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. అలాగే.. ఆర్టీసీ ఆస్తులు, అప్పు.. ఇంకా… అధికారికంగా విభజించలేదు. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ఎవరికి వారుగా నడుపుకుంటున్నప్పటికీ.. సాంకేతికంగా ఇంకా ఏపీఎస్ఆర్టీసీగానే ఉందని… ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు. అందుకే.. ఆర్టీసీ కార్మికులు భయపడాల్సిన అవసరంలేదని … ప్రభుత్వ డెడ్‌లైన్లను పట్టించుకోవాల్సిన అవసరంలేదని తేల్చేస్తున్నారు.

ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి వచ్చిన కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో సమ్మెను మరింత ఉధృతం చేయాలని జేఏసీ నేతలు యోచిస్తున్నారు. గురువారం హైకోర్టు తమకు అనుకూల నిర్ణయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ కోర్టు కేసు ఇంకా ఎక్కువ సమయం పడితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఈ లోగా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి చర్చలు జరపాలని ఆలోచనలో ఉన్నారు. మరో వైపు ఇక్కడిదాకా తెచ్చిన కార్మికులకు షాక్ ఇవ్వాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉందంటున్నారు. హైకోర్టులో గట్టి వాదన వినిపించాలనుకుంటున్నారు. అటో ఇటో తేల్చకుండా.. కనీసం సాగదీతగా అయినా ఉండేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఈ విషయంలో కేంద్రం జోక్యం కోసం.. అటు కార్మిక సంఘాలు.. ఇటు తెలంగాణ సర్కార్ కూడా.. తమతమ వాదనలకు మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. రెండు వర్గాలూ… తేగేదాకా లాగే పరిస్థితి తెచ్చుకున్నాయి.. ఎవరూ పట్టు వీడే పరిస్థితి లేదు కాబట్టి.. కేంద్ర ప్రభుత్వమే మధ్యేమార్గంగా.. ఏదో ఒక పరిష్కారాన్ని చూపించాల్సిన అనివార్యత ఏర్పడుతోంద్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close