రాజీలేదు : కత్తి దూస్తున్న కేసీఆర్‌

ప్రెవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. తమ పరిధిలో ఎవ్వరూ వేలు పెట్టకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో… కేసీఆర్‌ తమ సర్కారు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎంత కఠినంగా వ్యవహరించగలదో నిరూపించడానికి కత్తి దూస్తున్నారు. ప్రెవేటు విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని ఆయన నిరూపిస్తున్నారు. ప్రభుత్వానికి వారు సహాయ నిరాకరణ చేస్తే గనుక.. ప్రత్యామ్నాయాలు చూసుకుంటామే తప్ప.. వారి ఒత్తిడికి, బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గేది లేదని కేసీఆర్‌ నిరూపిస్తున్నారు.

ప్రెవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రభుత్వం పోలీసులతో తనిఖీలు నిర్వహింపజేయడం అనే వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో తీవ్రస్థాయిలో వివాదం రేగుతోంది. ప్రభుత్వం తనిఖీలు నిర్వహింపజేయడం సరికాదంటూ ప్రెవేటు కళాశాలల వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్‌బెంచ్‌ ప్రెవేటు కళాశాలల్లో ప్రభుత్వ జోక్యాన్ని తప్పు పట్టింది.

దానికితోడు ఈ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ.. ఎంసెట్‌ పరీక్షకు సహకరించేది లేదని ప్రెవేటు కాలేజీలు మంకుపట్టు పట్టాయి. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు కూడా కేసీఆర్‌ తలొగ్గలేదు. ప్రస్తుతానికి ఎంసెట్‌ను వాయిదా వేసి.. భవిష్యత్తులో కూడా నిర్వహించే అన్ని ప్రభుత్వ పరీక్షలకు కేవలం ప్రభుత్వ సంస్థల్లో మాత్రమే జరగాలని, ప్రభుత్వ ఉపాధ్యాయులతో మాత్రమే నిర్వహించాలని కేసీఆర్‌ వెంటనే ప్రత్యామ్నాయ నిర్ణయం తీసేసుకున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం కూడా పూర్తి మద్దతు ప్రకటించింది.

కేసీఆర్‌ ఈ విషయంలో చాలా దృఢమైన వైఖరినే అనుసరిస్తున్నారు. గురువారం నాటి సింగిల్‌బెంచ్‌ తీర్పుపై ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేసింది. ఆ పిటిషన్‌ను బెంచ్‌ విచారించి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రెవేటు కాలేజీలలో పోలీసులతో ప్రభుత్వ తనిఖీలకు అనుమతి ఇచ్చింది. నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తప్పు కాదనికోర్టు చెప్పడం విశేషం.

ప్రెవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు, నిబంధనలు విరుద్ధంగా అనేక అరాచకాలకు పాల్పడుతుండడం, అడ్డగోలు ఆర్జనలతో చెలరేగుతుండడం జరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌ ఇలాంటి పోకడలకు కత్తెర వేయడానికి డిసైడ్‌ అయినట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close