కాబోయే మహిళా మంత్రుల్లో ఒకరు సబితా ఇంద్రారెడ్డి..?

బంగారు తెలంగాణ సాధన క్రమంలో… రెండో సారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్… ఇప్పటి వరకూ.. ఒక్క మహిళా మంత్రిని తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో… చాలా చిన్న చిన్న మంత్రివర్గాలుంటాయి. అక్కడ కూడా కచ్చితంగా మహిళలకు అవకాశాలు ఇస్తారు. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకూ.. అలాంటి అవకాశమే రాలేదు. రెండో ప్రభుత్వంలో.. మొదటి సారి పేరు వినిపించలేదు. విస్తరణలోనూ చాన్స్ దక్కలేదు. ఐకు ఆరు పదవులు మిగిలాయి. వాటిలో రెండు కచ్చితంగా… మహిళలకు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఒక్క మంత్రితోనే.. రెండు నెలలకుపైగా గడిపేసిన కేసీఆర్.. ఇప్పుడు పదకొండు మంది మంత్రులున్నారు కాబట్టి… మరో దశ విస్తరణ ఎప్పుడు చేస్తారో ఊపించలేము. లోక్‌సభ ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి ఉండొచ్చు. అప్పుడు ఇద్దరు మహిళలకు చాన్సిస్తారని.. మనం గట్టిగా నమ్మాలి…ఎందుకంటే.. కేసీఆర్‌ స్వయంగా అసెంబ్లీలో చెప్పారు కాబట్టి..!

ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు వస్తాయన్నారు కానీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇస్తామని చెప్పారా.. అన్న లాజిక్ ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది. ఎందుకంటే… మహిళా మంత్రుల గురించి మాట్లాడింది… కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. దానికి రిప్లయ్ ఇచ్చింది కేసీఆర్. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతారని.. ఆమెకు మంత్రి పదవి ఇస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు సార్లు ఖండించినా… ఆమె సైలెంటయిపోయారు. ఆమె టీఆర్ఎస్‌లో చేరితే.. ఆమెకు మంత్రి పదవి.. ఆమె కుమారుడికి.. చేవెళ్ల ఎంపీ టిక్కెట్ బేరాలు జరిగాయని కూడా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ… విశ్వేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరిపోయారు కాబట్టి.. అక్కడ…టీఆర్ఎస్‌గు గట్టి అభ్యర్థి కావాలి. అనుచరగణం ఎక్కువ ఉన్న… ఇంద్రారెడ్డి వారసుడే దానికి కరెక్ట్ అని.. కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిలో ముచ్చటగా ముగ్గురంటే.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు టిక్కెట్లే… నలుగురికి ఇచ్చారు. వారిలో ముగ్గురు గెలిచారు. గెలిచిన ముగ్గురిలో ఇద్దరు రెడ్డి సామాజికవర్గం. ఒకరు ఎస్టీ. ఎస్టీ కోటా..మహిళా కోటా రెండూ కవర్ అవ్వాలంటే… ఆదిలాబాద్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు గ్యారంటీ. ఇప్పుడు రెండో సీటు ఇస్తానంటంది.. సబితా ఇంద్రారెడ్డికేనన్న విశ్లేషణ బలంగా వినిపిస్తోంది. కానీ.. టీఆర్ఎస్‌లో గెలిచిన ఇద్దరు రెడ్డి సామాజికవర్గ మహిళా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్‌తో ఉన్న వాళ్లే. వీరిలో ఒకరు ప్రమాణస్వీకారానికి వచ్చి.. కళ్లల్లో నీళ్లు నింపుకుని.. తిరిగి వెళ్లిపోయారు. తనకు కాక పదవి ఇంకెవరికైనా ఇస్తే ఆమె ఎంతగా రియాక్ట్ అవుతారో..?. మొత్తానికి రెండో మంత్రి పదవి సబితఇంద్రారెడ్డికి ఇస్తారో లేదో.. .. చేవేళ్ల ఎంపీ అభ్యర్థి ఎంపిక నాటికి తేలిపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close