ప్రత్యేకహోదా కోసం కేసీఆర్ లేఖ..! ఫెడరల్ ఫ్రంట్‌లోకి జగన్‌కి పంపుతున్న ఆహ్వానపత్రం..!

జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని తాపత్రయ పడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… తనతో కలసి వచ్చి .. తనకు అదనపు బలం ఇచ్చే పార్టీల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు అనుకున్న ఫలితాలు రావడం లేదు. ఒడిషాకు వెళ్లిన తర్వాతి రోజే.. తాను చంద్రబాబు వైపే ఉంటానన్న సంకేతాలు నవీన్ పట్నాయక్ పంపారు. మమతా బెనర్జీ అలాగే వ్యవహరించింది. అఖిలేష్, మాయావతి కలవడానికి కూడా నిరాకరించారు. ఇక కేసీఆర్ బలం ఇచ్చి.. బలం తెచ్చి పెట్టేది ఒక్కరే..!

హోదా లేఖతో ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్ ను ఆహ్వానించారా..?

టీఆర్ఎస్ అధినేత.. జాతీయ రాజకీయాల్లో తనకు మద్దతుగా ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనని గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే.. తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయలేదు. అంతే కాదు.. అవుట్ రైట్ గా సపోర్ట్ చేశారు. జగన్ కు … అత్యంత ఫేవర్ గా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. బహిరంగసభల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీళ్ల దొంగగా.. నర హంతకుడిగా కేసీఆర్ విమర్శించినా.. వైసీపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విమర్శించలేదు. ఈ కారణాలతో… టీఆర్ఎస్ అధినేతకు… జగన్ మంచి మిత్రుడిలా కనిపిస్తున్నారు. ఆయన తనతో పాటు ఫెడరల్ ఫ్రంట్ లోకి వస్తారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ ప్రయత్నంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

టీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలు కూటమిగా మారబోతున్నాయా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేకహోదా ఎవరు ఇస్తే.. ఢిల్లీలో వారికి మద్దతిస్తామని చెబుతోంది. ఆ లెక్క ప్రకారం… కాంగ్రెస్ పార్టీకి మద్దతి ఇవ్వాలి. కానీ.. వైసీపీ రాజకీయ విధానం బీజేపీకి దగ్గరగా ఉంది. ప్రత్యేకహోదా అడ్డు వస్తోంది కానీ.. ఈ పాటికి కలసి పోయేవారే. ప్రత్యేకహోదా అంశం.. ఓ సెంటిమెంట్ గా మారడంతో.. వైసీపీకి జాతీయ రాజకీయాల్లో ఎటు అడుగులు వేయాలన్నా… ప్రత్యేకహోదా పై తేల్చుకోవాల్సి ఉంది. అందుకే.. కేసీఆర్… వ్యూహాత్మకంగా ప్రత్యేకహోదాపై మాట మార్చారు. తాము ప్రత్యేకహోదాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పుకొచ్చి కావాలంటే ఏపీకి హోదా ఇవ్వాలని.. కేంద్రానికి లేఖ రాస్తామని ప్రకటించేశారు. అంటే.. తాము ప్రత్యేకహోదాకు అనుకూలమని.. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పడమే. అంటే.. కేసీఆర్ ప్రత్యేకోహోదాపై రాస్తామన్న లేఖ.. ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్ కు కేసీఆర్ పంపిన ఆహ్వానపత్రం లాంటిదన్నమాట.

వైసీపీ నుంచి అధికారిక ప్రకటనే మిగిలి ఉందా..?

వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీకి కేసీఆర్ అండగా ఉండేందుకు.. అటు కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలను.. కలిసి.. ఓ కూటమి కట్టి.. ఆ తర్వాత బీజేపీకి మద్దతిచ్చే వ్యూహం సిద్ధం చేశారన్న క్లారిటీ రాజకీయవర్గాల్లో ఉంది. అందుకే.. ఇతర పార్టీలు ఏవీ కేసీఆర్ తో జత కలవడం లేదు. కానీ జగన్ మాత్రం కలవక తప్పదు. ఎందుకంటే.. జగన్… కేసీఆర్ లాగే బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందో.. తర్వాతో.. ఆ పార్టీకే మద్దతిస్తారు. అందుకే… ఏపీ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ లో వైసీపీ భాగం కావడం కోసమే.. కేసీఆర్ ఈ లేఖ ప్రస్తావన తెచ్చారని.. దీన్ని వైసీపీ స్వాగతించి.. కేసీఆర్ నాయకత్వంలో ఫెడరల్ ఫ్రంట్ లో చేరడం ఖాయమేనన్న అంచనాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

— సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close