ప్రొ.నాగేశ్వర్: అసెంబ్లీ రద్దు చేసినా ఎన్నికలు జరగవా..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం.. అసెంబ్లీని రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగం ప్రకారం పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వాధినేత.. అంటే ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రి ఎవరైనా కావొచ్చు.. ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు.. గవర్నర్‌కు లేదా రాష్ట్రపతికి సిఫార్సు చేస్తే… కచ్చితంగా రద్దు చేయాల్సిందే. మరో అవకాశమే లేదు. మెజార్టీ కోల్పోయిన ముఖ్యమంత్రి కనుక.. అప్పుడు గవర్నర్ ఆలోచించే అవకాశం ఉంది కానీ… పూర్తి మెజార్టీ ఉన్న ముఖ్యమంత్రి రద్దు చేయాలని కోరితే.. రద్దు చేయాల్సిందే. అంటే… ప్రజలు ఐదేళ్లు పాలించమని చాన్స్ ఇస్తే.. నాలుగున్నరేళ్లకే ఎందుకు రాజీనామా చేస్తున్నారని.. ఎవరైనా విమర్శిస్తే. అది రాజకీయ ప్రశ్నే తప్ప రాజ్యాంగపరమైనది కాదు.

ఆరు నెలల్లోగా అసెంబ్లీ సమావేశం కావాల్సిందేనా..?

శాసనసభ సమావేశాలు ఎలా జరగాలి.. నిబంధనలు ఏమిటనేదానిపై.. ఎవరికి అనుమానం వచ్చినా.. చివరికి స్పీకర్లకు అనుమానం వచ్చినా రిఫర్ చేసే పుస్తకం.. పార్లమెంటరీ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్. ఇందులో పేజీ 195, 196లో.. రాష్ట్రాల శాసనసభల రద్దు గురించి ప్రస్తావించారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కేసీఆర్ గనుకు.. రద్దు చేయమని సిఫార్సు చేస్తే.. రద్దు చేయడం మినహా… గవర్నర్‌కు మరో దారి లేదు. ఇక రద్దయిన తర్వాత ముఖ్యమంత్రిగా .. కేర్ టేకర్ సీఎంగా ఉంటారు. అలా ఉన్నప్పుడు.. ఎన్నికలు ఎలా జరపాలన్నది మరో సందేహం. దీనికి రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ ప్రకారం.. పూర్తిగా ఎన్నికల కమిషన్ చేతిలో అధికారం ఉంటుంది. ఈసీ చేతుల్లో ఉన్నప్పుడు.. ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చా.. అనేది ఓ సందేహం. అలాగే ముందస్తు ఎన్నికలు వస్తే.. ఎప్పుడు వస్తాయనే సందేహం.. చాలా మందిలో ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. రెండు అసెంబ్లీ సమావేశాలు మధ్య ఆరు నెలల కన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. ఆరు నెలలలోపు కచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తీరాలి. అసెంబ్లీ రద్దు అయితే ఫిబ్రవవరి చివరిన… అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అంటే.. సెప్టెంబర్‌లోపు ఎన్నిగలు జరిగి కొత్త అసెంబ్లీ కొలువు దీరాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు. ఫిబ్రవరి చివరి లో అసెంబ్లీ సమావేశాలు జరిగినా.. అసెంబ్లీ ప్రోరోగ్ అయింది మాత్రం.. జూన్‌లో. అంటే జూన్ లెక్కలోకి తీసుకంటే.. ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించవచ్చేనే వాదన వినిపిస్తోంది. దాని ప్రకారం చూస్తే.. సెప్టెంబర్‌లో అసెంబ్లీని రద్దు చేయవచ్చు…ఎన్నికలు నిర్వహించి ఫిబ్రవరిలోపు.. అసెంబ్లీని సమావేశపరచవచ్చు. కానీ ఈ రెండు వాదనలు సరికాదు. ఇదే చర్చ గుజరాత్‌లో వచ్చింది.

గుజరాత్ పై సుప్రీంకోర్టు తీర్పు ఏం చెబుతోంది..?

2002లో గుజరాత్ అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో.. ఎన్నికలకు వెళ్తే… తనకు ఎంతో లాభం అనుకున్న నరేంద్రమోడీ.. జూలై 2002లో అసెంబ్లీని రద్దు చేశారు. వెంటనే ఎన్నికలు నిర్వహించమని ఈసీని కోరారు. అక్కడ ఏప్రిల్‌లో చివరి అసెంబ్లీ చివరి సమావేశం జరిగింది. ఆర్టికల్ 174 ప్రకారం.. ఆరు నెలల్లోగా.. అసెంబ్లీ సమావేశం జరగాల్సి ఉంది. అంటే… రద్దు చేసిన మూడు నెలల్లోగా.. కొత్త అసెంబ్లీకి ఎన్నికలు పూర్తి చేయాలి…. అసెంబ్లీని సమావేశపరచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్.. స్పష్టంగా చెప్పింది.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం.. స్వేచ్చాయుతమైన వాతావరణంలోఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది. కానీ అప్పుడు ప్రజలంతా భయకంపితులైన ఉన్నారు కాబట్టి.. అలాంటి పరిస్థితుల్లో ఫ్రీ అండ్ ఫెయిల్ ఎలక్షన్లు సాధ్యం కాదని స్పష్టం చేసింది. అందు వల్ల ఆర్టికల్ 174 ప్రకారం.. ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేసింది. అప్పుడు పరిష్కారం ఏమిటంటే… అసెంబ్లీ సమావేశ గడువు.. ఆరు నెలల ముగిసిన వెంటనే… రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసింది. అప్పుడు.. అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు ఓ రిఫరెన్స్ పంపింది. ఈ ఆర్టికల్ 174 , ఆర్టికల్ 324 మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే దగ్గర్నుంచి.. అనేక అంశాలపై … సవివరమైన నోట్ సమర్పించింది. రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరారు. అప్పుడు సుప్రీంకోర్టు.. ముగ్గురు సభ్యుల బెంచ్‌ను ఏర్పాటు చేసింది. ఆ బెంచ్ ఇచ్చిన తీర్పు… స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అది గుజరాత్ తీర్పుగా… పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తెలంగాణ ముందస్తు ఎన్నికలకు కూడా ఆ తీర్పు మార్గదర్శకం అవుతుంది.

ఆరు నెలల నిబంధన ఇప్పటికే ఉన్న అసెంబ్లీకి మాత్రమే వర్తిస్తుంది..!

గుజరాత్‌ తీర్పులో చాలా ముఖ్యమైన అంశాలున్నాయి. రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య కాలం.. ఆరు నెలలు కచ్చితంగా ఉండాలన్నది.. రద్దు కాని శాసనసభకే వర్తిస్తుదన్నది..మొదటిది. రద్దు అయిన శాసనసభకు వర్తించదు అని. ఆర్టికల్ 174(1) ప్రకారం గత సమావేశం.. చివరి.. ఈ సమావేశం మొదటి రోజు.. అంటే.. అప్పటికే ఉన్న ఉన్న అసెంబ్లీనే. కొత్త అసంబ్లీ కాదు కదా.. అని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. రద్దయిన శాసనసభకు కూడా.. ఆర్టికల్ 174(1) వర్తిస్తే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఉదాహరణకు.. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన ఐదున్నర నెలల తర్వాత అసెంబ్లీని రద్దు చేశాడనుకుందాం. ఎన్నికల సంఘం.. పదిహేను రోజుల్లో ఎన్నికలు నిర్వహించేసి.. కొత్త అసెంబ్లీని సిద్ధం చేయలేదు కదా..! . ఆర్టికల్ 174(1) ప్రస్తుతం ఉన్న శాసనసభలకే వర్తిస్తుంది. అలాగే.. అసెంబ్లీ రద్దు అయితే. ఎప్పట్లోపు ఎన్నికలు నిర్వహించాలనేది.. మరో సందేహం. దీనికి సంబంధించి ఎక్కడా.. నిబంధనలు లేవు. కానీ… ప్రజాప్రాతినిధ్య చట్టాలు పరిశీలిస్తే.. ఏ ఎన్నిక అయినా సరే ఆరు నెలల్లోపు పెట్టాలనే నిబంధన ఉంది. అదే అసెంబ్లీ రద్దు అయిన వాటికి కూడా వర్తిస్తుంది. ఇవీ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరక్షన్స్.

ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే.. ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సిందే..!

అంటే.. ఇప్పుడు… సెప్టెంబర్‌లో… కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తే..ఆరు నెలల్లో అంటే..మార్చి లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందే. కేసీఆర్ రద్దు చేస్తే.. ఈసీ ఎన్నికలు పెడుతుందన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఇది తప్పు… ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ప్రకారం.. ఆరు నెలల్లో కొత్త అసెంబ్లీ ఏర్పాటు కావాలి. ఒక్క రోజు కూడా.. వాయిదా వేసే అధికారం ఈసీకి కూడా లేదు. దీని ప్రకారం.. ఇప్పుడు.. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసినా.. పార్లమెంట్‌ ఎన్నికలతో సంబంధం లేకుండా ముందస్తు ఎన్నికలు జరుగుతాయి. ఓటర్ల లిస్టు సవరణ ఇంకా జరుగుతూనే ఉంది.. ఎలా ఎన్నికలు జరుపుతారని.. కొంత మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉంది. అందువల్లే పూర్తిగా తేలేదేమిటంటే.. అసెంబ్లీని రద్దు చేసే అధికారం… కేసీఆర్‌కు ఉంది. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లో.. ఎన్నికలు నిర్వహించడం ఈసీ బాధ్యత. దానికి పార్లమెంట్ ఎన్నికలతో సంబంధం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close