ఫెడరల్ జెండా ఎత్తేసిన కేసీఆర్..! ఎన్నికల తర్వాత బీజేపీతోనే..!?

ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. ఎన్నికల అనంతరం బీజేపీకి మద్దతుగా నిలబడతానని హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది. కొద్ది రోజులుగా కేసీఆర్ వ్యవహారశైలి బీజేపీకి అనుకూలంగా ఉంటోంది. బీజేపీకి సపోర్ట్‌గా కొన్ని పార్టీలను సమీకరించి ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలనే ప్రయత్నాలను కేసీఆర్ చేశారు. కానీ అవి వర్కవుట్ కాకపోయేసరికి సైలెంట్‌గా ఉండిపోయారు. ఇప్పుడు ఆ కూటమి గురించి పూర్తిగా మర్చిపోయారు. అదే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఓ కూటమిని సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తాను ఆ కూటమి వైపు వెళ్లనని.. కేసీఆర్.. ప్రధానమంత్రి మోడీకి చెప్పినట్లు జాతీయ మీడియా చెబుతోంది. అయితే ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకోవడాని సిద్దంగా లేను కానీ.. ఆ తర్వాత మద్దతు మాత్రం బీజేపీకే ఇస్తానని గట్టి హామీనే ఇచ్చారట.

భారతీయ జనతా పార్టీ కూడా కేసీఆర్‌పై నమ్మకంగా ఉంది. కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలనుకుంటోంది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చాయి. ఈ సారి వాటిలో కనీసం సగానికి సగం తగ్గిపోతాయి. ఆ తగ్గిపోయే సీట్లను దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలనేది అమిత్ షా ప్లాన్. కానీ బీజేపీ సొంతంగా … సీట్ల కోసం పోటీ పడే పరిస్థితి ఉన్నది ఒక్క కర్ణాటకలోనే. మిగతా రాష్ట్రాల్లో రహస్య మిత్రులతో గట్టెక్కాల్సిందే. ఆ జాబితాలో టీఆర్ఎస్, వైసీపీ, అన్నాడీఎంకే, బీజేడీ లాంటి పార్టీలు ఉన్నాయి.

అయితే జాతీయ మీడియా కేసీఆర్ వ్యూహాన్ని మరో కోణంలోనూ ఆవిష్కరిస్తోంది. ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితుల్లో లేకపోతే.. ప్రాంతీయ పార్టీల కూటమి వైపు వెళ్లడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని విశ్లేషిస్తున్నారు. బీజేపీ అధికారం చేపట్టే పరిస్థితి లేకపోతే.. ఆ పార్టీతో కలిసి..కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే సాహసం కేసీఆర్ చేయరని అంటున్నారు. కేంద్రంలో నేరుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మాత్రం వ్యతిరేకిస్తారు. బీజేపీతో పాటే ఉంటారు. ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే మటుకు టీఆర్ఎస్ ఆ కూటమి ఉంటుందని జాతీయ మీడియా చెబుతోంది. వీటిలో అతిశయోక్తి కూడా ఏమీ లేదు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అలాగే ఉంటాయి మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close