ఆర్కే పలుకు : కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు భయం !

ఇంత జరుగుతున్నా.. కేసీఆర్ ఎందుకు మోనంగా ఉంటున్నారు ! ఇలాంటి సందర్భం వస్తే బీజేపీపై గాయి.. గత్తర చేసి.. తనను తాను కేసీఆర్ ఎలివేట్ చేసుకుని ఉండేవారు కదా ! అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ అనుమానాలకు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో సమాధానం ఇచ్చారు. అదేమిటంటే… ఆ టేపులన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చినవని.. ఈ వ్యవహారాన్ని కేంద్రం తీసుకోవాలనుకుంటే క్షణాల్లో అయిపోతుందని ్దే జరిగితే ఫోన్ ట్యాపింగ్ సహా మొత్తం బయటకు వస్తాయని ఆర్కే చెబుతున్నారు. అవి ట్రాప్ చేసిన ఆడియోలు కాదని.. ముందుగానే మాట్లాడుకున్న ఆడియోలను ఆర్కే చెబుతున్నారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని మాట్లాడుకున్న ఆడియోల్లో.. కలసి కూర్చుందాం అని ఉండదు కదా అని ఆర్కే భావన. అందుకే అవి ట్యాప్ చేసిన ఆడియోలని.. ఈ వ్యవహారం కేంద్రం చేతికి వెళ్తే అధికారులు, నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇరుక్కుపోతారని అందుకే కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని అంటున్నారు.

గతంలో చంద్రబాబు ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఆడియోలు రిలీజ్ చేశారని అప్పుడు చంద్రబాబు మరో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ భయపడి పారిపోయారని ఆర్కే చెబుతున్నారు. ఇప్పుడు మోదీ, అమిత్ షాలు అలా భయపడే రకం కాదని పైగా వారి చేతుల్లో కేంద్రం ఉందన్న సంగతిని కేసీఆర్ మర్చిపోరని ఆర్కే చెబుతున్నరాు. కారణం ఏదైనప్పటికీ.. కేసీఆర్ సైలెంట్‌కు కారణం భయమేనే ఆర్కే అంతర్గతంగా విశ్లేషించారు కానీ.. వ్యూహం అనుకోవడం లేదు. అదే సమయంలో ఈ వ్యవహారం విషయంలో కేసీఆర్‌కు ఇంటా బయటా సానుకూలత రాలేదని తేల్చారు. కేసీఆర్ కొనలేదా అని అందరికీ ఓ అభిప్రాయం ఉండటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.

ఫోన్ ట్యాపింగ్ ద్వారా కానీ.. మరో విధంగా కానీ ఫామ్ హౌస్ కేసు ద్వారా కేసీఆర్.. బీజేపీ పెద్దలతో నేరుగా తలపడే ప్రయత్నం చేస్తున్నారని.. కానీ బీజేపీ ఆ అవకాశాన్ని ఇవ్వదని ఆర్కే తేల్చేశారు. అదే సమయంలో ఆర్కే వ్యక్తం చేసిన మరో అనుమానం ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ను కాపాడుకునేందుకు.. డీల్ సెట్ చేసుకుని.. సైలెంట్ అయ్యారేమోనని. అయితే అసలు .. ఫామ్ హౌస్ కేసులో ఎలాంటి పెద్దల పేర్లు లేవు.. దొరికిన వారు.. పెద్దలకు సన్నిహితులన్న పేరు లేదు.. కొన్ని ఫోటోలున్నాయి. అంత మాత్రాన వారు బీజేపీకి చెందిన వారేనని ఎవరూ నిరూపించలేరు. ఇది కూడా ఓ కారణం కావొచ్చని ఆర్కే చెబుతున్నారు.

కేసీఆర్ విషయంలో ఆర్కే… విశ్లేషణ ఎప్పుడూ నెగెటివ్ కోణంలోనే ఉంటుంది. ఈ సారి కూడా అంతే. బీజేపీతో ఢీ కొట్టాలనుకునే ఆయన జాతీయ పార్టీ పెట్టుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను కూడా వదిలేసి ఢిల్లీ వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ నేతలు ఎలాంటి కేసులు పెట్టినా అది కేసీఆర్‌కు అడ్వాంటేజ్ అవుతుంది. ఆర్కే ఈ లాజిక్ ఎందుకు మిస్సయ్యారో !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close